వైఎస్ మా అసోసియేషన్ కి ఎందుకు సాయం చేయలేదు..ఇదిగో రీజన్..


తెలుగు చిత్రసీమలో కొంతమంది ఆ మాటికి వస్తే, ఓ సామాజిక వర్గం ముందుండి మరీ వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఒంటికాలిపై లేస్తుండేది..ఇంతమందిమి కలిసి వెళ్తే..మా అసోసియేషన్ కి స్థలం ఇవ్వలేదని ఈసడిస్తుండేవారు..ఇంతమంది డబ్బులున్నవాళ్లున్నారు మీకెందుకయ్యా ప్రభుత్వస్థలం అనేవారు కానీ అసలు నిజం ఇప్పుడు పృథ్వీరాజ్ నోటి వెంట బైటికి వచ్చింది..

2004 ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రచారచిత్రాల కోసం ధర్మవరపు సుబ్రహ్మణ్యం చేత కొన్ని షూట్ చేయించడానికి పూనుకున్నారట..కానీ అప్పట్లో చిత్రపరిశ్రమలోని వారు దానికోసం ఒక్క థియేటర్ కానీ..ఒక్క టెక్నికల్ ఎక్స్ పర్ట్‌ని కానీ ఇచ్చేవారు కాదట..దానికోసం ధర్మవరపు సుబ్రహ్మణ్యం మద్రాసుకు వెళ్లి షూటింగ్ చేయించుకొచ్చారట..కానీ ఆ తర్వాత 2004 ఎన్నికలలో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత మాత్రం సీన్ అంతా మారిపోయిందట..
ఇది సినిమా వాళ్ల నైజానికి నిదర్శనం అనే కంటే కొంతమంది నైజానికే నిదర్శనంగా చెప్పుకోవాలి..అందుకే
ఆ తర్వాత మురళీమోహన్ ఆధ్వర్యంలో సినిమాజనం వైఎస్‌ని కలిసి తమకి ప్రభుత్వం ఓ స్థలం కేటాయిస్తే దానికి తగ్గట్లుగా బిల్డింగ్ కట్టుకుంటామని అడిగితే..దానికి వైఎస్..ఏం బాబూ అప్పట్లో ఇలా చేశారు కదా..అని గుర్తు చేసి..మీ దగ్గర డబ్బులు లేకపోవడమేంటని అన్నారట..ఇదీ అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపరిశ్రమకి చేయని సాయం వెనుక కథ

Comments