కాస్త ఫన్...బోలెడు ఫ్రస్ట్రేషన్..కలగలిసిన చంద్రబాబు ప్రసంగం



పోలింగ్ దగ్గరపడేకొద్దీ టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గారి మాటలు కోటలు దాటిపోతున్నాయ్. ఆయనని విమర్శించడమే పనిగా పెట్టుకోవడం కాదు వాస్తవం చూస్తే..ఎవరికైనా ఇప్పుడు చేసిన కామెంట్‌ కరక్టే అని ఒప్పుకోవాల్సిందే..కావాలంటే చూడండి చిత్తూరు జిల్లా మదనపల్లిలో మండుటెండలో ప్రచారసభకి వచ్చిన జనాలకు బాబు బోలెడంత ఫన్ పంచారు..

తిరిగి టిడిపిని అధికారంలోకి తీసుకువస్తే..140 నదుల అనుసంధానం చేస్తానంటూ ప్రకటించారు..కావేరి-గంగా, పెన్నా..ఈ నదుల అనుసంధానానికే కోట్లకి కోట్లు ఖర్చు అవుతాయని ఇప్పుడు కాదు..2001 సమయంలోనే వేసిన లెక్క ఇది. అలాంటిది ఏకంగా బాబుగారు దేశంలోని 140 నదుల అనుసంధానం చేస్తానంటూ ప్రకటించడం
ఆయన పార్టీ కార్యకర్తలకు, తెలుగు తమ్ముళ్ల చెవులకింపుగా ఉండొచ్చేమో కానీ..అది కుదిరేపని కాదు..ఎఁదుకంటే బోలెడన్ని అంతరాష్ట్ర వివాదాలు..నదుల అనుసంధానానికి అడ్డుపడుతున్న రోజులు..ఆ మాటకి వస్తే కింద రాష్ట్రాలకు నీళ్లు ఇవ్వాలంటేనే నానాతిప్పలు..పానీపట్ యుద్దాలు జరుగుతున్న రోజులు..ఇది ఆయన ఫన్..

ఇంకో కామెడీ విషయం ఏమిటంటే..ఐదేళ్లు..అక్షరాలా..ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబుగారు ఇప్పుడే కళ్లు తెరిచినట్లు తిరిగి అధికారం ఇస్తే..30లక్షల ఉద్యోగాలు ఇస్తారట ఓ వైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీనే దేశవ్యాప్తంగా తాము 22లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటిస్తే..ఈయన ఒక్క రాష్ట్రంలోనే 30లక్షలు ఇస్తామని చెప్పడం ఫన్ కాదా..!

ఇక ఫ్రస్ట్రేషన్ విషయానికి వస్తే..కేంద్రంలో మోడీ..రాష్ట్రంలో జగన్ ఈ ఇద్దరిపై తన అక్కసు వెళ్లగక్కారు. జగన్ మోడీకి ఊడిగం చేస్తున్నారట..అఁదుకోసం మోడీ, కేసీఆర్ జగన్‌కి బిస్కెట్లు వేస్తున్నారట ఈయనేమో వాళ్లకి కుక్కలా పడి ఉంటాడు..కుక్క బిస్కెట్లు వేస్తుంటారు అఁటూ అధమస్థాయికి దిగజారి వ్యాఖ్యానించారు..ఇలా మాట్లాడటం ఆయనలోని ఫ్రస్ట్రేషన్‌కి నిదర్శనమని ప్రసంగాల తీరు చూస్తే అర్ధం అవుతోంది. ఎందుకంటే వైఎస్ జగన్ టఫ్ ఫైట్ ఇస్తోన్నట్లు ప్రతి సర్వే చెప్తోంది..గెలుపు ఖాయమని కొన్ని జగన్ అనుకూల మీడియా కానీ..అభిమానులు కానీ
రాస్తుండొచ్చు..కానీ టిడిపి గెలుస్తుందనే సర్వే మాత్రం ఇంతవరకూ ఇచ్చే ధైర్యం చేయలేదు. పైగా ప్రతి నియోజకవర్గంలో ప్రచారం జరుగుతున్న తీరు చూస్తుంటే జగన్ గెలుపు ఖాయం అనే మాట
విన్పిస్తోంది..అఁదుకే ఆ ప్రచారానికి బ్రేక్ వేసేందుకే చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు..అందులో భాగంగానే నిస్పృహకి లోనై..ఇలా మాట జారుతున్నట్లు చెప్తున్నారు

Comments