ఉద్యమసింహానికే బెదిరింపులా...వాటే జోక్

తెలంగాణ సాధించిన నేతగా స్కందావారాల భుజకీర్తులతో..విలసిల్లే కేసీఆర్ పై ఓ  సినిమా రావడం..అది పూర్తవడం జరిగితే..అది రిలీజ్ కాకపోవడం ఉంటుందా..ఉందట..మార్చి 29న విడుదల అంటూ పోస్టర్లు కూడా కొడితే..అది కాస్తా విడుదల అవడం లేదని..డిస్ట్రిబ్యూటర్లు బెదిరిస్తున్నారని నిర్మాతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ వాపోయారు..
అసల ీవార్త నమ్మేలా ఉందా..అందులోనూ నిర్మాతలు కల్వకుంట ఇంటి పేరు..
ఇలాంటి తరుణంలో ఈ సినిమాను ఫ్రీగా యూట్యూబ్ లో విడుదల చేస్తున్నామంటూ ఇద్దరూ చెప్పడం చూస్తుంటే..బోలెడంత క్లారిటీ వచ్చేస్తుంది
ఎందుకంటే..ఈ సిీనిమా మొత్తం కేసీఆర్ ని ధీరోధాత్తుడిగా చిత్రీకరిస్తూ సాగి ఉంటుంది..నిజంగా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపై ఇంట్రస్ట్ చూపించి ఉండకపోవచ్చు..ఐతే నిర్మాతల టార్గెట్ వేరే ఉంటుందని టాక్..ఎన్నికల టైమ్ లో అందరికీ వెళ్లడమే లక్ష్యం తప్ప..నిజంగా సినిమా రిలీజ్ చేసి.దాన్నేదో థియేటర్లలో ఆడించడం వారి ఉద్దేశం అయి ఉండదు..
ఎవరూ కొనకనే..ఇలా ఫ్రీగా వేసుకుంటున్నార్ బై అని కొందరు వాదిస్తున్నారు కానీ..అసలు నిజం అది అయుండకపోవచ్చు..అసలు సెన్సార్ అయిందో లేదో కూడా డౌటే అని ఓ పిల్మ్ నగర్ వాసి డౌట్..ఇవన్నీ ఏమోకానీ..యూట్యూబ్్ని అడ్డం పెట్టుకుని పార్టీకి  ఫ్రీ పబ్లిసిటీ పొందడమే నిర్మాతల లక్ష్యం అయి ఉండొచ్చు
మామూలుగా అయితే..సినిమా విడుదల చేస్తే..అది ప్రకటన కింద చూడాలి..ఇలా అయితే ఎవరికీ ఏమీ వివరణ ఇవ్వకుండా ఉండొచ్చు కదా..కానీ ఈసీకి ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం యూట్యూబ్ నుంచైనా డిలీట్ చేయకతప్పదు

Comments