మాటలు కోటలు దాటేస్తున్నాయ్...చేతలు మాత్రం చెప్పలేం బాబూ


పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసే చంద్రబాబుగారు అంతకు ముందు తానేం చేసానన్నది జనాలకు గుర్తులేదనుకుంటే సరే..కానీ ఇక్కడాయన విమర్శలు చేసింది రావెల కిషోర్ బాబు..రావెలని మంత్రి వర్గం నుంచి తొలగించారు..కారణం ఏంటో చెప్పలేదు..సరే అదీ వదిలేసినా..రావెల జనసేనలోకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ వెళ్లారు..పైగా..దాన్ని వెంటనే ఘనత వహించిన స్పీకర్ గారు ఆమోదించేశారు కూడా..అలాంటప్పుడు ఆయన సిగ్గులేనివ్యక్తి ఎలా అవుతారు..ఇలా అనడం ద్వారా ప్రత్తిపాడులో మీ ఓటమి మీరే కొని తెచ్చుకున్నట్లు కాదా..అందులో ఆయన ఎస్సీ..ఓ ఎస్సీని పట్టుకుని ఇలా తిట్టవచ్చా అనేది ముఖ్యమంత్రిగారే సమర్ధించుకోవాలి..అట్రాసిటీ కేసులే దాఖలు అయితే..ఈసీ కూడా జోక్యం చేసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి కదా..స్టైల్ మార్చా..ప్రచారం రూటు మార్చా అనుకోవచ్చు కానీ..బాధ్యతగల పదవిలో ఉండి..అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు కదా..
ఇక రాజకీయ కామెంట్లే చూసుకుంటే..హైదరాబాద్ లు ఒకటి కాదు రెండు కాదు 20 చేస్తారట..వద్దన్నదెవరు బాబూ..అదే కదా మాకు కావాల్సింది..ఎటొ్చ్చీ మీరు ఒక్కో నగరానికి ఐదేసేళ్లు తీసుకుంటారేమో..జోక్ కాదు..మీ పనితీరు అలానే ఉంది. మరి..అలానే కేసీఆర్ రిటన్ గిఫ్ట్ గురించి మాట్లాడటం మానేసి రెండు నెలలు దాటింది..మీరింకా గుర్తు పెట్టుకున్నారు..మీకంత సత్తానే ఉంటే..తెలంగాణలో పోటీ కూడా పెట్టడం ఎందుకు మానేశారో చెప్పగలరా..ఇంకో కామెంట్ సార్ సార్ అని పిలిచా అంటారు..తప్పేముంది..అందులో..పైనున్న వ్యక్తిని సార్ అనో..బాస్ అనో పిలుస్తాం.అది మనల్ని మనం తగ్గించుకోవడమా...అలాగైతే..పై అదికారులు ఎప్పుడూ కిందివారికంటే ఎక్కువ వయసు ఉన్నవాళ్లే ఉండాలా...రేపొద్దున్న రాహుల్ గాంధీనో...మాయావతినో..ఇంకోళ్లో ఇంకోళ్లో అయినా..సార్ అనే అంటారు..దానికేం ఫీలవకండి సార్..సార్ అనడంలో బానిసతత్వం ఉందనుకుంటే ముందే మానేయాల్సింది..

అలానే బాపట్లని అభివృధ్ది చేస్తాం..సూర్యలంకని టూరిజం స్పాట్ ‌చేస్తామని ఇప్పుడు కాదు..మీరు ప్రతిసారీ చెప్తూనే ఉన్నారు..మేం వింటూనే ఉన్నాం..ఇప్పటికీ అక్కడ రాత్రి 7గంటలు దాటితే..ఒక్క లైట్ కూడా ఉండదు..మీకు తెలీదనుకుంటా..మేం చూసి మాట్లాడుతున్నాం..ముందు పెట్రోమాక్స్ లైట్లు ఓ డజను ఏర్పాటు చేయించండి..టూరిజం స్పాట్ వరకూ  ఎందుకు..అందుకే మాటలు కోటలు దాటుతాయ్..పనులు మాత్రం గడప కూడా దాటవు అనడంలో తప్పేముంది..ఎందుకంటే మీరు మీ ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నారు..

Comments