సోషల్ మీడియాలో ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేస్తే..ఇలా చేయొచ్చు బట్ ఆన్‌లైన్ ఫ్రెండ్షిప్ డేంజర్స్ కూడా తెలుసుకోండి


మెచ్చిన మగువ కోసం ఎంతకైనా తెగించడం మగతనం అనుకోవడం కొంతమందికి అలవాటే..అందులో ఇప్పుడు
అసలు స్నేహితుల కంటే..సోషల్ స్నేహితులకోసమైతే..ఏమైనా చేయడానికి సిధ్దమవుతున్నారు. రోజూ ఇలాంటి
వార్తలు చదువుతూనే ఉన్నాం..వాటిలో ఇఁకోటి కూడా చూడండి.. 
ఈ కథలో పదిహేడేళ్ల టీనేజర్ సోషల్ మీడియాలో ప్రెండ్షిప్ కోసం తహతహలాడుతుండేవాడు. అందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫి'మేల్' నేస్తం
దొరికింది. అందులో ఆమె వయసు 21ఏళ్లుగా చెప్పింది..ఇంకేముంది మనోడు తనని ఓ పాతికేళ్ల యువకుడిగా పరిచయం చేసుకున్నాడు..
తెగ చాటింగ్ చేసుకుంటూ ఉండేవారు..ఒకరి బాడీ ఒకరు చూపించుకునేందుకు పోటీ పడ్డారు..ఐతే ఫిమేల్ ఫ్రెండ్ మాత్రం తన ఇఁటిమేట్ ఫోటోలు చూపించకుండా..
ఈ బాయ్ ఫ్రెండ్‌వి మాత్రం తెగ అడిగేదట..అలా అలా మనోడు నిజస్వరూపం అంతా తన సోకాల్డ్ గాళ్ ప్రెండ్ ముందు పరిచేశాడు
ఐతే ఇదిలా జరుగుతుండగానే..మన కథలోని టీనేజ్ హీరో పేరుతో మరో అక్కౌంట్ క్రియేట్ అయిందిట..ఇందులో హీరోగారి వీడియోలు..ఫోటోలు దర్శనమిచ్చాయట..పైగా
ఆ అక్కౌంట్ నుంచే మనోడికి బెదిరింపులు కూడా వస్తున్నాయట..ఈ ఫోటోలు వీడియోలు కనుక బైటపడితే నీ పరువు పోతుందిరో అంటూ బ్లాక్ మెయిల్ చేశారట..అలా ఓ పదిలక్షల రూపాయలు డిమాండ్ చేయడం కూడా జరిగింది..దీంతో మనోడు కొంపలోని వస్తువులు...ఆర్నమెంట్స్ అన్నీ అమ్మేసి డబ్బులు కట్టడం ప్రారంభించాడు..ఇదీ స్టోరీ

ఇంతకీ ఈ బ్లాక్ మెయిల్ చేసిన అక్కౌంట్ ఎవరిదంటే..హీరోగారి ఫిమేల్ ఫ్రెండ్‌దే..ఈ ఫ్రెండే ఆ అక్కౌంట్ కూడా క్రియేట్ చేసింది..రాజాజీ నగర్ ఏరియా పరిధిలో జరిగిన
 ఈ ఘటన..బెంగళూరులో కలకలం రేపింది..ఇంతకీ అసలు ట్విస్ట్ ఏంటంటే..ఈ ఫిమేల్ ఫ్రెండ్ కూడా ఓ మగాడిదే..ఇదీ సోషల్ ఫ్రెండ్షిప్ గొప్పతనం..కాబట్టి..అవతలి నేస్తం
ఆడైనా..మగైనా..రెచ్చిపోయి బట్టలు చించుకుంటే..చిరిగిపోయేవి మన బట్టలే కాబట్టి..తస్మాత్ జాగ్రత్త

మరి ఇలాంటి బెదిరింపులు వచ్చినప్పుడు సిగ్గు పడకుండా కంప్లైంట్ చేయాలంటే..ఓ సైట్ ఉంది..అది www.cybercrime.gov.in..ఇక్కడ ఎలాంటి బెరుకూ లేకుండా..
కంప్లైంట్ చేసుకోవచ్చు..మన ఫోటోలు..మన న్యూడ్ వీడియోలు మన ఇష్టం..కానీ మన అనుమతి లేకుండా వాడటం..సర్క్యులేట్ చేయడం నేరం..బ్లాక్ మెయిల్ చేయడం
అంతకంటే నేరం

Comments