బరి తెగించారు..ఎన్నికల కోడైతే..ఏంటి..గాడిద ఎగ్గైంతే ఏంటి..సిగ్గా ఎగ్గా...!


ఎన్నికల కమిషన్ ఈ దేశంలో ఉందంటే కేవలం అధికారులను బదిలీ చేయడం..నోటీసులు పంపడం అంతకంటే ఏం ఉంటుంది..మహా అయితే ఎన్నికలు పోస్ట్ పోన్ చేయడం ఇంకా ఎక్కువైతే..రద్దు చేయడం..ఇంతకు మించి అధికారాలు ఏం ఉన్నాయ్. అందుకే నేతలు అందులోనూ తెలివైన తలలు పండిన నేతలు తమ ఇష్టం వచ్చినట్లు
ప్రవర్తిస్తున్నారు. రూల్స్ తయారు చేసేదీ వాళ్లే..చత్..తొక్కలో రూల్స్..మాకేంటి..అని తొక్కేదీ వాళ్లే..ఎఁదుకంటే..కోరల్లేని పాము వారినేం చేయలేదనే ధీమా..

కావాలంటే చూడండి రాజస్తాన్ గవర్నర్..కల్యాణ్ సింగ్ మళ్లీ ప్రధానమంత్రిగా మోడీనే చూడాలనుకుంటున్నాడట..పిలుపూ ఇచ్చేశాడు..ఔన్ నేను బిజెపి కార్యకర్తనే అందుకే అట్ట అంటాను..ఏం చేస్కుంటారో చేస్కోండి అంటాడు..మరి ఈసీ ఏం చేస్తుంది...కాస్త సీరియస్సైంది..ఈసారి రాష్ట్రపతికి లెటర్ రాసిందంటున్నారు..ఆయన మాత్రం ఏం చేస్తాడు..వీళ్లంతా బిజెపివాళ్లే కదా..అఁదుకే కదా..గవర్నర్లుగా, స్పీకర్లుగా పార్టీ కాండిడేట్లను పెట్టొద్దనేది..అదే కామ్రేడ్లని చూడండి..పాపం అమాయకంగా స్పీకరో..ఇంకోటో ఇస్తే
ఎంత పద్దతిగా పని చేస్తారో..(నాకు గుర్తున్నంతవరకూ)..ఈయన భాగోతం ఇలా ఉఁటే..ఇంకో బిజెపి మహామహిమాన్వితుడు యోగీ ఆదిత్యనాధ్..ఈ సిగ్గు ఎగ్గూ..విగ్గూ లేని నేత మోడీ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసిందంటూ ప్రచారం చేసుకుంటున్నాడు..అసలు సైనికుల బొమ్మలే వాడొద్దురా బాబూ అంటుంటే..ఈయనగారి నిర్వాకం ఇలా తగలడింది. ఈసీ దీనిపై మాత్రం కాస్త సాఫ్ట్ కార్నర్ తీసుకుంది..మేం డిసైడ్ చేస్తాం..నువ్ తప్పు చేశావో లేదో అంటోంది..కళ్లకి ఎదురుగా నిజం కనిపిస్తుంటే ఇలా కవర్ చేయడం తగునా..

వీళ్లకి బాబులాంటోడు మోడీ..గత ఎన్నికలలోనే సిగ్గు లేకుండా ఓటేసి..ఆ విషయాన్ని అర్ధమయ్యేలా పువ్వొకటి పట్టుకుని ఫోజులిచ్చాడు..పైగా ఆ తర్వాత పార్లమెంట్ దేవాలయం అంటూ బిల్డప్
ఇచ్చాడు..ఇదే తీరు అప్పట్లో బాబుగారిది కూడా..తాజాగా కూడా ఏదో ఆయనే చేసినట్లు..హలో..మనోళ్లు ఇవాళ యాంటీశాటిలైట్ ఆయుధం ప్రయోగించారు..చూసారా..మన దేశం
ఎంత గొప్ప ప్రగతి సాధించిందో అంటూ ఫోజులిచ్చాడు..సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోనూ ఇంతే..ఈయన బిటీమ్‌గా చెప్తున్న కేసీఆరే స్వయంగా ఇప్పటికి అరడజనుసార్లు చెప్పుకొచ్చాడు యూపిఏ టైమ్‌లో 11సార్లు మెరుపుదాడులు చేశారు స్వోమీ..నువ్వేంది ఊరక డప్పు కొట్టుకుంటున్నావ్ అని..ఐనా ఎవడు విన్నాడు..
ఇప్పుడు ఈ ఈసీ ఆగ్రహం కల్యాణ్ సింగ్, ఆదిత్యనాధ్ పై ఏ మాత్రం పని చేస్తాయో చూద్దాం

Comments