శివాజీ విల'నిజం'


ఎవడమ్మ మొగుడు సొమ్మని రాజధానిని తరలిస్తారు..?ఇదీ ఓ బాధ్యత కలిగిన ఆర్టీఐ సామాజికవేత్తగా .యూత్ ఐకాన్‌గా..ఆంధ్రప్రజల సంరక్షుడిగా..ప్రత్యేకహోదా నిరంతరసాధనసమితి మెంబర్‌గా తనని తాను భావించే శివాజీ వాడిన పదజాలం..నిజమే అమరావతిని తరలిస్తే..ఎవడూ ఊరుకోడు..అసలు నీదాకా ఎందుకు శివాజీ
అక్కడి రైతులే ఊరుకోరు..కానీ ఇప్పుడే ఎందుకు ఇలా నువ్ రెచ్చిపోతున్నావ్..ఏం చేయాలనుకుంటున్నావ్..
అంటే చంద్రబాబు గెలిస్తేనే రాజధాని ఇక్కడ ఉంటుందా..లేకపోతే ఉండదా..ఎవరు చెప్పారు..ఆపరేషన్ గరుడలాగా ఇది కూడా నీ సృష్టా..లేక నిజంగానే నీకు తెలుసా..లేక నీకు నువ్ ఊహించుకున్నావా..నీ పారానాయిడ్ సైకాలజీని ఎఁదుకు జనంలో రుద్దుతావ్..అమరావతిలో రాజధాని ఉండదు అని ఎందుకు ముందునుంచే నువ్ ప్రచారం మొదలుపెట్టావ్..ఓ వేళ నీకు కానీ..నీ ఊరి దగ్గర్లో రావాలని ఉందా..ఎందుకిలాంటి ప్రచారం చేస్తున్నావ్..
ఇది నిజం కాదు..విలనిజం అన్పించుకుంటుంది. అసలు రాజధాని అనేది ప్రభుత్వాలకు సంబంధించినది..ఏ పార్టీకో సంబంధించిన వ్యవహారం కాదు.. ఓ వేళ మీ పార్టీ అలా భావిస్తే భావించి ఉఁడొచ్చు

ఇటుక పడలేదనే నాలుగేళ్లక్రితం చేసిన వ్యాఖ్యలే నీ మెదడులో ఈ ప్రచారానికి పురికొల్పాయా..పైగా చంద్రబాబుని వెనకేసుకుని వచ్చి..చాలా టైమ్ పడుతుంది అంటున్నావ్ పట్టనీ..కానీ అప్పటిదాకా ఈ విషబీజాలు నాటే కార్యక్రమం మానుకో..ఎన్నికలలో గెలుపు ఎవరిదైనా కావచ్చు..అంతమాత్రాన రైతుల గుండెల్లో గునపాలు
ఎందుకు గుచ్చుతున్నావ్..రేపేదైనా రైతుల పేరిట రెచ్చగొట్టే కార్యక్రమం ఏదైనా మీ పార్టీ ఏర్పాటు చేసిందని..లీక్ వచ్చిందా నీకు..నీ అ.జోకి..అసలు ఏదో నీ నైన్ ఛానల్ తప్ప ఎవడూ పట్టించుకోని నిన్ను సడన్‌గా అన్ని ఛానల్స్ ఎలా కవర్ చేయగలిగాయ్..రాత్రికి రాత్రే అన్ని ఛానళ్లకి ఉదయం 9 గంటలకు లైవ్
తీసుకోవాలని ఏ పార్టీ నుంచి అదేశాలు వెళ్లాయ్..ఈ సందేహాలకు జవాబు చెప్పు..

Comments

  1. ha ha ha . It's really fun watching some one having frustration....

    ReplyDelete

Post a Comment