భయమెందుకు బాబూ...జనమంతా ఉండగా...బిజెపి అంత పిచ్చి పని చేయదులే


రేపో మాపో నన్నూ అరెస్ట్ చేస్తారు..ఏ తప్పూ చేయకపోతే నాకేంటి భయం..జైల్లోనే కూర్చుంటా..అంటూ చంద్రబాబుగారు ఎన్నికల ప్రచారంలో మండిపడటం వెనుక కారణం ఏంటి..బిజెపి అంత పని చేస్తుందా..అసలు ఏ కేసులో చంద్రబాబుగారిని జైల్లో పెడతారు..అందులోనూ ఏప్రిల్ 11నఎన్నికలు ఉంటే..ఆర్రోజుల ముందు అరెస్ట్ చేసి..టిడిపిని గెలిపించే బాధ్యత తలకెత్తుకుంటారా..ఎవరైనా..?

ప్రతి అంశమూ టిడిపి తనకి అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట అనడంలో సందేహం లేదు. ఎందుకంటే..ఐటీ రెయిడ్స్ అనేవి ఒక్క పార్టీపైనే ఎందుకు చేస్తారంటూ ఆ పార్టీ లీడర్లు గొంతు చించుకుంటున్నారు కానీ..అదే ప్రశ్న రివర్స్‌లో వేస్తే..మీమీదే ఎందుకు దాడులు  అని అడిగితే ఏం చెప్తారు..నీతిగా నిజాయితీగా నిప్పులా బతికే టిడిపి లీడర్ల అభ్యంతరం ఏంటి..మీపై ఎందుకు కక్ష గడతారు..ఎందుకంటే..మీ దగ్గర డబ్బు పోగుపడింది..దానికి లెక్కలు లేవని అనుమానం కాబట్టి..ఓ వేళ నిజంగానే మీ దగ్గర ఏమీ దొరకకపోతే..అది మీరు ప్రచారానికి వాడుకోవచ్చు..ఎటూ సిఎం రమేష్ పోట్లదుర్తిలో అదే చేశాడు..నా దగ్గర ఏం దొరికిందో అందరికీ చెప్పాలంటూ ఆదాయపు పన్ను అధికారులను చెడామడా వాయించేశాడు...

మీరు మాపై ఎందుకు దాడులు అని అడిగి ఊరుకుంటే చాలు..వైఎస్సార్సీపీ పై ఎందుకు దాడులు లేవు అని అడగడంతోనే...రాజకీయ కుట్ర ఆపాదించేశారు అంటే ఎవరు అధికారంలో ఉంటే..వారు అవతలివారిపై చేయొచ్చనే సూత్రాన్ని మీరు నమ్ముతున్నారా...ఇదే అర్ధం అవుతోంది మాకు..పైగా చంద్రబాబుగారిపై ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేసే కేసులు ఏమైనా ఉన్నాయా..లేనే లేవు..ఇప్పుడు కేసు పెట్టినా..దానిపై విచారణ..గవర్నర్ అనుమతి..లాంటి తతంగాలు అనేకం ఉంటాయి..అవన్నీ వదిలేసి నన్ను అరెస్ట్ చేస్తారు..చేస్తారు అనడానికి మీ దగ్గర్నుంచి ఇక కొత్తగా రాబట్టడానికి లొంగదీయడానికి ఏముంది..ఎటూ మీ జీవితం తెరిచిన పుస్తకం కదా..

Comments