హంగ్ రావాలి..ఆ పార్టీలకు సత్తా చూపిస్తాం..అందరి మాటా ఇదే

పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీకి ఫుల్ మెజారిటీ రాకూడదు..అదే సమయంలో మాకు ఎక్కువ సీట్లు రావాలి. ఇదీ రీజినల్ పార్టీల అధినేతల మనోగతం..ఇదే అభిప్రాయాన్నివైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా బైటపెట్టేశాడు..ఎన్డీటివి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.." రిజల్ట్స్ వస్తుంటే..అప్పుడు తెలుస్తుంది బిజెపి, కాంగ్రెస్‌కి ప్రజాస్వామ్యం అంటే ఏంటో..అందుకే నామటుకు నాకు హంగ్ రావాలనే కోరుకుంటున్నా" అంటూ మనసులో మాట బైటపెట్టేశాడు..ఈయనే కాదు..అందరిదీ అదే మాట..16 సీట్లివ్వండి మనకి కావాల్సినవన్నీ తెచ్చుకుందాం అని టిఆర్ఎస్..పాతిక సీట్లివ్వండి బిజెపికి చుక్కలు చూపిద్దాం అని టిడిపి ప్రచారం చేసుకుంటుంది కూడా ఇదే

కానీ వైఎస్ జగన్ చెప్తున్నట్లు జరగాలంటే..రెండు పరిణామాలు ఉత్పన్నం అవ్వాలి..అప్పుడే ఆయన అనుకున్నది నెరవేరేది..ఒకటి అటు బిజెపి, కాంగ్రెస్ రెండు పార్టీలు లేదంటే కూటములకు..ఏ రెండొందలో..175 సీట్లో వచ్చి ఆగిపోవాలి..వైఎస్సార్ కాంగ్రెస్‌కి 25 రావాలి..అంటే ఈయన చేతిలో లేని రెండు పనులు జరగాలి..ఇదే సూత్రం
చంద్రబాబునాయుడుగారికి వర్తిస్తుంది..ఆయన అనుకున్నది చేయాలంటే..ఆయనా పాతిక తెచ్చుకోవాలి..కాంగ్రెస్ కి ఫుల్ మెజారిటీ రావాలి..లేదంటే మెజారిటీకి దగ్గర్లో ఆగిపోవాలి..ఇక్కడ కేసీఆర్ పరిస్థితైనా అంతే..ఇంకోటి ఏమిటంటే..వీళ్ల సీట్లు రావాలంటే..ప్రత్యర్ధి పార్టీలు పూర్తిగా ఓడిపోవాలి..ఓరకంగా మూడు పరిణామాలు వీళ్లు అనుకున్నట్లు జరగాలి ఒకటి ప్రత్యర్ధి పార్టీలు పూర్తిగా సున్నాకి పరిమితం అవ్వాలి..రెండోది వీళ్లకే అన్ని సీట్లూ రావాలి..ఆ తర్వాత కాంగ్రెస్, బిజెపిలు మెజారిటీకి అతి దూరంలో ఆగిపోవాలి..

ఇదే సందర్భంలో జగన్ చెప్తున్న రెండు అంశాలు ఎప్పట్నుంచో ఉన్నవే అయినా..ఇప్పుడు కొత్తగా ఓ ప్రచారం ఊపందుకుంది...ఎన్డీటీవితో మాట్లాడుతూ..కాంగ్రెస్‌ని క్షమించేసినట్లుగా చెప్పడం..ఆంధప్రదేశ్‌కి ప్రత్యేకహోదా ఇస్తే ఏ పార్టీకైనా మద్దతు ఇస్తా అని చెప్పడమే అది..ఇప్పటికి కనీసం ఓ 12సార్లు జాతీయ ఛానెళ్లతోనే చెప్పాడాయన. ఐతే దీన్నే చంద్రబాబు పట్టుకుని రాహుల్ గాంధీ ఇస్తానంటున్నాడు కదా..ఆయనకెందుకు మద్దతు పలకడు జగన్ అని నిలదీశారు కూడా..ఇప్పుడదే లైన్‌లో జగన్..కాంగ్రెస్‌కి మద్దతిచ్చేందుకైనా రెడీ అన్నాడు..కన్సర్న్ అంతా
హోదానే అంటూనే..ఇలాంటప్పుడు ఇక కొత్తగా మాట మార్చడం ఏం లేదుకదా..ఓ వేళ ఉన్నా..ఇందులో తప్పేంటి..నిజానికంటా..ప్రత్యేక హోదా అంటూ వస్తే..అందుకు అందరూ స్వాగతించాలి కానీ..దాన్ని ఎగతాళి చేయకూడదుగా..హోదాతో ఏం వస్తుంది..అదేం సంజీవినా..అనే డైలాగులు మళ్లీ వినపడకూడదుగా..

Comments

  1. ఇప్పుడు రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు, 2019 ఎన్నికలలో 25 సీట్లూ తమకే ఇమ్మని, అలా ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పి ప్రత్యేక హోదా తీసుకువస్తామని ప్రజలకి ఆశలు కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడ అధికారంలోకి వస్తే వెంటనే హోదా ఇస్తామని వాగ్దానం చేస్తోంది. కాని కాంగ్రెసుకి వచ్చే ఎన్నికలలో విజయం లభిస్తుందని దేశంలో ఎవరూ అనుకోవడంలేదు. అది ఇంచుమించు అసాధ్యం. బిజెపికి వచ్చే ఎన్నికలలో పూర్తి మెజారిటీ రాకపోవచ్చు కాని వాళ్ళు మళ్ళీ టిడిపితోనో, వైకాపాతోనో పొత్తు పెట్టుకుంటారని నేను అనుకోవడంలేదు. ఎందుకంటే అంతకంటే తక్కువ బేరంలో దొరికే పార్టీలు ఇతర రాష్ట్రాలలో ఎన్నో ఉన్నాయి. స్వార్థ, కుటుంబ ప్రయోజనల కోసం కేంద్రంలో ఎవరికైనా మద్దతు ఇచ్చేందుకు ఎన్నో చిన్న చిన్న పార్టీలు దేశంలో సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఎంతో తప్పనిసరి పరిస్థితులలో తప్ప బిజెపి రాష్ట్ర పార్టీలతో పొత్తు పెట్టుకోదు. ఇప్పుడు బిజెపి దృష్టిలో ఆంధ్రప్రదేశ్‌ది “దిల్ మాంగే మోర్” టైపు. రాష్ట్ర ప్రజల ఆశలు వాళ్ళకి గొంతెమ్మ కోరికలలా కనిపిస్తున్నాయి.

    ReplyDelete

Post a Comment