పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడో చెప్పేసిన శివాజీ


నటుడు శివాజీ ఏ పార్టీ భవిష్యత్తు ఏంటో చెప్పడమే కాదు.. ఏ పార్టీ అధినేత ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారో కూడా చెప్పేస్తున్నారు.. దీనికోసమే  ఆయన ప్రత్యేకంగా నటనకు స్వస్తి చెప్పి మరీ ఓ కోర్సు చేసినట్లుందంటూ సెటైర్లు పేలుతున్నాయ్ కూడా..చంద్రబాబునాయుడుగారిని గెలిపించమనిడైరక్ట్‌గా అడిగే దమ్ము లేక, ఇలా రకరకాల అంశాలు సంబంధం లేనివి ప్రస్తావిస్తూ..ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోసిన శివాజీ గారు ఏపీపై కుట్రకోణాన్ని
బైటికి తీశారంటూ ఇప్పటికే బాకా ఊదడం కూడా ప్రారంభమైపోయింది..

అంతటితో కాకుండా..ఇతరులపై రాళ్లేసేటప్పుడు ఓ నాలుగు మంచి మాటలు మాట్లాడితే..ఆయనేం చెప్పినా నమ్ముతారనే బండ ఫార్ములానేతన నిజం విత్ డ్యాష్‌లో కూడా నమ్ముకున్నట్లు అర్ధం అవుతోంది. అందుకే తమ బ్యాచ్‌తో కలిసిపోయిన పవన్ కల్యాణ్ చాలా నిష్కల్మష మనస్తత్వమనిచెప్పుకుంటూ..ఆయనలాంటి వారు రాజకీయాలకు అవసరం అని చెప్పారు. కానీ ముఖ్యమంత్రి కావాల్సిన సమయం మాత్రం ఇది కాదట..ఇప్పుడే అవలేరట/నిన్ననే ఉగాది పంచాంగం పూర్తైతే...ఇప్పుడు శివాజీ పంచాంగం వికారి నామసంవత్సరంలో ఇకారంగా మొదలుపెట్టినట్లుంది. పవన్ కల్యాణ్ మాత్రం అమాయకంగా
జనంలో తిరగడం ఎఁదుకు శివాజీనే అడిగి ఎప్పుడు సిఎం అవుతారో తెలుసుకుంటే చెప్పేవాడు కదా..ఎందుకంటే ఆయన మహా మేధావి కదా..

ఒక్క ఇటుక పడలేదంటూ జగన్ కామెంట్ చేసిన ఓ నాలుగేళ్ల నాటి వీడియో ఇప్పుడు షో చేస్తే..అది తాజాది అయిపోతుందా..ఈ లెక్కన చంద్రబాబు ఎప్పటికప్పుడు డెడ్‌లైన్లు పెట్టుకుంటూ పోయిన ప్రాజెక్టుల పాత వీడియోలు వేయవయ్యా శివాజీ..పైగా నీ బ్యాండ్ మేళం పార్టీ నినాదం ప్రత్యేక హోదా కదా..దాన్నెందుకు వదిలిపెట్టి..ఈ సోదంతా చెప్తున్నావ్..ఆ వీడియో కూడా వేయ్..చంద్రబాబుగారు ఎన్నిసార్లు ప్రత్యేక హోదా...ప్యాకేజీపై తన అమూల్యమైన అభిప్రాయాలు ఎలా ట్విస్ట్ చేశారో కూడా ప్రదర్శించు..శివాజీ షోతోనే...ప్రతిపక్షంపై బురద జల్లడంతోనే తప్ప...తానేం చేసింది..చేయలేనిదీ..చెప్తే..ఓట్లు పడవనేది బాగా అర్ధమైపోయింది

Comments