కోడెలపై దాడి..పచ్చనిజాలు..అసలేం జరిగిందో తెలుసా


శ్రీమాన్ కోడెలగారు రిగ్గింగ్ జరుగుతుందనే సమాచారం తెలిసి ఇనిమెళ్ల వెళ్లారట..కానీ బూత్‌లో కార్యకర్తలు కూడా కాదు..ఓటేయడానికి వచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులట( నీకు చెప్పారా వాళ్లు ఓటు వేసింది వైఎస్సార్సీపీ అని..మెడలో బోర్డులేమైనా వేసుకున్నారా) కోడెలతో వాగ్వాదానికి దిగారట..అవును ఇందులో తప్పేముంది కాండిడేట్లకి ఏం అవసరం బూత్ లోకి వెళ్లడానికి..ఐనా వెళ్లారని రాసారు..తర్వాత కార్యకర్తలు భారీగా వచ్చారట..పోలింగ్ సిబ్బందే తలుపులు మూశారుట..లోపలకెళ్లి మరీ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆయన్ని బైటికి లాగారట..తరిమికొట్టారట..ఇదీ ఈదినం పత్రిక కథనం..ఇందులో ప్రతి అక్షరం తప్పే..పైగా వాళ్లు రాసిన కథనంలోనే బోలెడు లోపాలు ఉన్నాయ్..బూత్ లోపల కూర్చోవడం ఆయన తప్పు..వద్దన్నా వినకుండా..బైఠాయించడం ఇంకో తప్పు..

అసలు ఈ కథనంలో డొల్లతనం చూద్దాం..ఉదయం 11 గంటల సమయం అని రాశారు..అది తప్పు..ఆయన ఉదయం 9 గంటలకే అక్కడ తయారయ్యాడు..ఎందుకంటే..పదకొండుగంటలకు నరసరావుపేట నుంచి కానీ..సత్తెనపల్లి నుంచి కానీ కోడెల బయలుదేరితే..సదరు ఇనిమెట్ల  అనబడు ఇనిమెళ్లకి వెళ్లడానికి కనీసం గంట సమయం పడుతుంది..లేదూ 10 గంటలకు బయలుదేరారు అని అన్నా..పదకొండు గంటల సమయం అనేది తప్పు..ఆయన అలవాటు ప్రకారమే ఉదయాన్నే ఈ పల్లెలను చుట్టబెట్టడానికి తయారయ్యారు. పోలింగ్ బూత్ లో కూర్చుని రిగ్గింగ్ కి ప్రయత్నించారనే వైఎస్సార్సీపీ వాదనే కరెక్ట్..ఆ ఊళ్లో ఆ  పార్టీక ఓటేసేవాళ్లే ఎక్కువ..అలాంటి చోట కూర్చుని దేశమంతా సీన్ క్రియేట్ చేసేందుకు కూర్చుండిపోయారనడంలో సందేహం లేదు..

పైగా గంటసేపు నిర్బంధించారనడమూ తప్పే...ఆయనే పోలింగ్ సెంటర్ లోపల తలుపులు బిడాయించుకున్నారు..పైగా చిత్రంలో చూపించిట్లు కారులోంచి లాగి కొట్టలేదు..ఆ దృశ్యాలు..10టివి..టివి9 సహా అనేక ఛానళ్లలో చూడొచ్చు..పోలింగ్ సెంటర్ నుంచి బైటికి వచ్చి కారులో ఉడాయిస్తుంటే వెనక పరిగెత్తిన జనం దృశ్యాలు అవి...అయితే ఇక్కడ కోడెల ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు..ఎందుకంటే..ఎక్కడకైనా వెళ్లి రిగ్గింగ్ బూత్ కేప్చరింగ్ చేయొచ్చనుకుంటారాయన అని లోకల్స్ చెప్తుంటారు..బాంబు దాడులు చేస్తారన్నా...రాళ్లు విసురుతారన్నా లెక్క చేయరు..ఈయన వైఖరితో విసిగిపోయిన జనమే ఇప్పుడు ఎదురు తిరిగి ఇలా దాడి చేశారంటున్నారు..ఎందుకంటే విడిరోజుల్లో ఎవరూ కోడెల  ఎదుట నిలబడే దైర్యమే చేయలేరు..ఇంకో సంగతి..40ఏళ్లలో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదంటున్నారాయన..మరి సిట్టింగ్ ఎమ్మెల్యేపై 2014తో పాటు ఇప్పుడు జరిగిన ఎన్నికలలోనూ ప్రతి సందర్భంలో టిడిపి క్యాడర్ దాడులు చేస్తూనే ఉంటుంది..దానికేం అనాలి..పైగా 1999లో కోడెలగారి ఆస్పత్రి( కోట అంటుంటారు)లోనే ఎన్నికలకు ముందు తయారు చేస్తోన్న బాంబులు పేలి ఆయనగారి అనునాయులు నలుగురు చచ్చారు..వాళ్లతో నాకేంటి సంబంధం అని అప్పట్లో నమ్మబలికారాయన. ఇలాంటి చరిత్ర ఉంటుంది కాబట్టే..చివరిదశలో వాటికే విక్టిమ్ కావాల్సి వస్తుంటుంది

Comments