జగన్ సిఎం..వినోద్ సెంట్రల్ మినిస్టర్..ఏం కలల్రా బాబూ


మొత్తానికి ఆంద్రప్రదేశ్‌లో అసెంబ్లీ..తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయ్..25 ఎంపి సీట్లో మెజారిటీ సీట్లు తమవేనంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంటే..టిడిపిదీ అదే మాట..అసెంబ్లీలోనూ తామే గెలుస్తామంటూ రెండు పార్టీలు భజన చేసుకుంటున్నాయ్. జగన్ మోహన్ రెడ్డైతే ఆల్రెడీ కేబినెట్ కూడా డిసైడ్ చేసుకున్నాడని మొన్నామధ్య సూర్య పేపర్ రాసుకొ్చ్చింది భజన చేయడంలో ఆ..జో పేపర్ ని మించిపోవాలనే ఆత్రంలో అసలు సరుకే ఎసరు  తెచ్చేలా ఓ కథనం రాసుకొచ్చిందా పేపర్..

ఎన్నికలలో ఇప్పుడు పోలింగ్ మాత్రమే కదా పూర్తైంది..ఇంకా మే 23 వరకూ ఆగాలి ఫలితాలు తెలియాలంటే..కానీ ఈలోపు పందెగాళ్లు టెన్షన్ తో చచ్చిపోవడం ఖాయం..ఐతే జగన్ మోహన్ రెడ్డి ఎప్పటిలాగానే దేవుడి ఆశీస్సులు ఉంటే అవుతానంటున్నాడు..ఈయన ఊహల పల్లకి అలా ఉంటే...తెలంగాణలో ఇంకోలా ఉంది

అక్కడికేదో నిజంగానే సంకీర్ణం వచ్చేసినట్లు తాను కేంద్రమంత్రి అయినట్లు వినోద్ కుమార్ ప్రకటించుకుంటున్నాడు..దానికి ఈటల వంత పాడాడు. ఈసారి ఆయనమంత్రివుతడు అంటూ..మరి ఈయన ఏ పార్టీ కూటమిలో చేరతాడో కూడా చెప్పేస్తే బెటర్ కదా..కన్ఫ్యూజన్ లేకుండా

Comments