ఫ్యాన్స్ ఆనందం సరే..మరి అల్లూ అర్జునూ నువ్వేం చేశావ్ పైనుంచి చేతులూపావా


హీరోలంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నంతవరకూ వారికేం ఢోకా ఉండదు..వరసగా సినిమాలు తంతున్నా..కోట్లకి కోట్లు తీసేసుకుంటారు..అందుకే ఇదేం అభిమానం రా బాబూ అన్నట్లుగా..అప్పుడప్పుడు బాలయ్యలోని గ్లాడియేటర్ బైటికి వచ్చి నిజంగా తన్నినా...మా బాబే ఎంత చక్కగా తన్నావ్ అని మురిసిపోతారట..బాలయ్య గారి భార్యగారే ఈ విషయాన్ని సెలవిచ్చారు.

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పెద్ద వాన కురుస్తున్నా లెక్క చేయకుండా ఫ్యాన్స్ ఆయనని చూడటానికి చూసి
కేరింతలు కొట్టడానికి వచ్చారు..అది చూసి ఆయనా సంబరపడినట్లుంది..దానికి ఓ వ్యక్తి ట్విట్టర్లో వీడియో పెట్టి హీరోలకు ఫ్యాన్స్ కి మధ్య బాండింగ్ అంటే ఇది..అంటూ కామెంట్ పెట్టాడు..

ఇంతవరకూ బాగానే ఉంది కానీ..మరి మన హీరో...జస్ట్ ఆ వానలో బాల్కనీ నుంచి చేయి మాత్రమే ఊపడానికి పరిమితం అయ్యాడా..వీడియోలో అంతవరకే ఉంది..చూస్తే..కనీసం కిందకు వచ్చి కాసేపు మాట్లాడటమో..లేకపోతే వాళ్లనే లోపలకు రానివ్వడమో చేయొచ్చుగా..బురద అయిపోతుందని భయమా..చూద్దాం..తర్వాత వీడియోలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో 

Comments