పవన్ నీ జ్ఞాపకశక్తికి జోహార్లు..నరసాపురంలో నాగేంద్రబాబు పోటీ చేస్తున్నాడా లేదా..ఆలీ చెప్పింది విను


"వైసీపీ పాపం ఆలీని వాడుకుని వదిలేసింది..ఐనా నన్ను అడిగితే టిక్కెట్ ఇవ్వనా...ఆలీ తన చుట్టానికి అడిగితే..నేను..అదే ఆ ఊరు పేరేంటి అదే..ఆ...నర్సాపురం...అదే ఏంటా పేరు..ఆ...ఏంటీ..ఆ నరసరావుపేట ఎంపి టిక్కెట్ ఇచ్చా..ఆలీ కష్టాల్లో  ఉన్నప్పుడు ఆదుకుంటే...ఇలా నన్ను వదిలేసి..ఏమైందో ఏంటో..వైసీపీలో జాయినయ్యాడు.."

ఇలా అడ్డూ అదుపూ లేకుండా సాగిపోయిన ప్రసంగంలోనే ఎన్నో డొల్లలు..తాను ఏ పార్టీనో..తన పార్టీ తరపున ఏ వ్యక్తికి ఎక్కడ టిక్కెట్ ఇచ్చాడో కూడా గుర్తులేదా..పైగా సొంత అన్న నరసాపురం నుంచి దిగుతుంటే...ఆలీ చుట్టానికి ఇచ్చానంటూ మర్చిపోవడం ఏంటి..ఇదేనా నీ జ్ఞాపకశక్తి..అందుకే అంటోంది..నిజంగా పవన్ కల్యాణ్ కి
తన అభ్యర్ధులు ఎంతమందో..ఎక్కడ్నుంచి దిగారో కూడా తెలీదు అని లేకపోతే నరసాపురంలో నాగేంద్రబాబు దిగితే..ఆ పేరుని నరసరావుపేటకి బదులు చెప్పడం ఏంటి..ఈ గందరగోళాన్ని పక్కనబెడితే..


ఇక రాత్రికి ఆలీ ఎమోషనల్ గా ఓ పోస్ట్ పెట్టాడు..పవన్ గారంటే నాకు ఇక్కడ ఉన్నాడు..నేను మీలాగా అన్నగారు బాట వేస్తే రాలేదు..సొంతంగా పైకి వచ్చా పైగా నేనెవరినీ వేషం ఇవ్వమని డబ్బులు ఇవ్వమని అడగలేదు..ఎటూ రాజమండ్రి వచ్చారు కదా..ఆలీపై కూడా ఏదైనా కామెంటే చేయమని మీ పక్కనున్నోల్లు
చెప్పి ఉంటారు...మీరు నాకేదో సాయం చేశారని చెప్తున్నారు..ఏరకంగా..సినిమాలు ఏమైనా ఇప్పించారా..పోనీ డబ్బు సాయం ఏదైనా చేశారా..అంటూ ఆలీ అడగడం చూస్తే..పాపం పవన్ చివరికి ఇలా స్నేహితులను కూడా మోసం చేస్తారా అనకతప్పదు..వైఎస్సార్సీపీలో చేరితే తప్పేంటి అని సూటిగా అడిగాడు ఆలీ..మరి దీనికి జవాబు ఏంటో చెప్పండి

Comments

  1. పవన్ కళ్యాన్ కి కామెడీ చేయడానికి ఆలీ దొరికాడు. రాజకీయాల్లో కూడా కామెడీ అవసరం. 30 ఇయర్స్ (రాజకీయాల్లో ) ఇండస్ట్రీ అక్కడ !

    ReplyDelete
  2. రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ శాశ్వత శత్రువులూ ఉండరు!

    ReplyDelete

Post a Comment