మంత్రి పత్తిపాటి పుల్లారావ్ భార్య హల్ చల్ అంటూ బ్రేకింగ్..లోపలేమో విషయం వేరు..తడబడిన టివి9



పాపం..టివి9 ఉద్యోగులు..కొత్త మేనేజ్‌మెంట్ ఏం చెప్తుందో..అర్ధం  చేసుకోవడంలో కన్ఫ్యూజన్‌లో ఉన్నట్లున్నారు. ఎందుకంటే ఈ బ్రేకింగ్ చూడండి..


మంత్రిగారి భార్య హల్ చల్ అని పెట్టడం..ఆమెని టోల్ గేట్ వద్ద  ఆపారు..ఆమె బాబూ నేను విఐపిని అని చెప్పడం క్లియర్ గా కన్పిస్తుంది..ఇక్కడ ఆమె హల్ చల్ ఏంటో తెలీదు..అంటే ఈ విజువల్ పట్టుకుని పత్తిపాటిని గేలి చేయడం బ్రేకింగ్ ఉద్దేశం..వాస్తవానికి నేషనల్ హైవేలపై ఎమ్మెల్యేల వాహనాలకు ఖచ్చితంగా టోల్ ప్లాజా మినహాయింపు ఉంటుంది..అందులో ఎవరున్నారనేది కాదు ముఖ్యం

బ్రేకింగ్ అది నడిపారు..కానీ లోపల రిపోర్టర్ మాత్రం పాపం అసలు వాస్తవం తెలిపాడు..టోల్ ప్లాజానే ఓవర్ యాక్షన్ చేశారని..


ఆ తర్వాత ఇంకా గందరగోళం..వాస్తవానికి 56 రూపాయలు కట్టి వెళ్లిన తర్వాత ఇక హల్ చల్ కానీ..ఓవరాక్షన్ కానీ ఏం ఉండదు..ఎందుకంటే టోల్ ప్లాజాల దగ్గరే కాదు..ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా మామూలు మనుషులు కూడా గొడవపడటం సాధారణమే..మంత్రిపత్తిపాటి వైఫ్ కావడమే ఇక్కడ న్యూస్ చేయాలనుకుంది..ఇలాంటి చెత్త బ్రేకింగులు పెట్టే..ఛానళ్లు జనం చేత చెడతిట్లు తిట్టించుకోవాల్సి వస్తుంది

Comments