బాధ్యత వద్దంటున్న బాబుగారూ..పోతే ఆ తర్వాత విచారించేవారా



ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా..ఈసీ వ్యతిరేకిస్తుందని..ఏప్రిల్ 11 నుంచి బాధ వ్యక్తం చేస్తోన్న చంద్రబాబుగారు ఇంకో ప్రసంగం వింటే..ఏంటిలా మాట్లాడుతున్నారీయన అన్పించకమానదు..అసలే తిరుపతి దేవుడి జోలికి వస్తే ఊరుకుంటాడా తమ్ముళ్లూ..మాడి మసైపోతారు..అని స్వయంగా ఆయనే ఎన్నికల ప్రచారంలో శాపనార్ధాలు పెట్టారు..దేవాలయంలో తవ్వకాలు జరిగాయంటూ పుకార్లు బయలుదేరాయి..ఇలాంటి నేపధ్యం ఉన్న సందర్భంలో ఏకంగా 1100కేజీల బంగారం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినది వస్తూ చెన్నైలో ఆగిపోయింది అంటే..దాంతో టిటిడికి ఏంటి సంబంధం అంటే ఎలా..?

ఓ వేళ ఆ బంగారమే పరుల పాలైతేనో..పక్కదారి పడితేనో..కేవలం పంజాబ్ నేషనల్ బ్యాంక్ పై కేసు పెట్టి ఊరుకుంటారా కాదు కదా..ఏకంగా  ఓ చిన్నసైజు లారీ అంత బంగారం తరలి వస్తుంటే..వాళ్లు సమాచారం ఇవ్వలేదు సరే..మన గడువు ముగిశాక..ఆరా తీయాల్సిన అవసరం మనకి ఉంది కదా..మనకి అంటే..ప్రభుత్వానికే కాదు..టిటిడికి కూడా అని..ఎందుకంటే..ఆ బంగారం ప్రభుత్వానిది కాదు..తిరుమలదేవుడిది..

దానికి సిఎస్ వంతపాడుతున్నారని వాపోవడం ఎందుకు..ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ మధ్యదాకా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా చేసారు గుర్తుంది కదా..ఓహో..మీకెటూ ఆయనపై విమర్శలు చేయడం పరిపాటిగా  మారిపోయింది కాబట్టి..ఇప్పుడు మీ బీట్ ఈసీ నుంచి సిఎస్ వైపుకు కూడా మళ్లింది కదూ..కాబట్టి..ఆయన ఏం చేసినా దానిపై మీ మార్క్ డైలాగ్ వేయాలని డిసైడయ్యారన్నమాట..కానీ మీరు చివరిలో ఓ మాట అన్నారు చూసారూ..ఏదో సంస్థ నష్టాల్లో ఉంటే మూసేయాలని అనకూడదా..లాభాలు తెచ్చే దారి చూపాలా..మరదే మీరు సిఎంగా ఉన్నప్పుడు చిత్తూరు డైరీ విషయంలో ఎందుకు చేయలేదు..సారీ..సారీ హెరిటేజ్ డైరీ పాలే తాగాలి కదా..ఈ మధ్యకాలంలో డైరీ సంస్థలు ఎంతెంత లాభాలు వస్తున్నాయో తెలిసి కూడా అవన్నీ తమరి హయాంలో ఎలా మూతవేయగలిగారు బాబూ..ఫైబర్ గ్రిడ్ సంస్థ మనోళ్లదే అనే ప్రచారంలో వాస్తవం కూడా చెప్తే..అప్పుడు మీ ఆంట్రప్రెన్యూర్షిప్  అసలు రూపం బైటపడుతుంది సార్..

Comments

  1. పచ్చ బాచీ చేతులెత్తేసిన వైనంబెట్టిదనిన:

    https://chaakirevu.wordpress.com/2019/05/02/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B/

    ReplyDelete
    Replies
    1. గులాం గ్యాంగ్ పండగ చేస్కోండి.

      Delete
  2. "కొనసాగిస్తా.. టిడిపి ప్రతిపక్షంగా వున్నప్పుడు, వైఎస్ తో ఢీకొన్నప్పుడు కూడా వ్రాసినట్టే, వ్రాస్తాను. నాకు అర్థం అయ్యింది, అర్థం చేసుకొన్నట్టే, కొందరికి అర్థం కానట్టే. ..చాకిరేవు"

    https://chaakirevu.wordpress.com/2019/05/02/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%9C%E0%B0%BE-%E0%B0%B8%E0%B0%AE%E0%B1%80%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-2/

    ఇదండీ కథ, కులమీడియా వీడుకోలు ప్రకటనలు మొదలెట్టేసింది. కులగజ్జి, పచ్చ మాఫియా & సైకిల్ భజనమండలి బాపతు తప్ప మిగిలిన సకలాంధ్ర జనానికి ఇక అచ్చే దిన్.

    ReplyDelete
    Replies
    1. ముక్కాలా ముకాబలా...

      https://youtu.be/B9WqGQz22Co

      Delete

Post a Comment