సల్మాన్ ఖాన్, మహేష్ బాబు గురించి డైరక్టర్ తేజ చెప్పిన ఆసక్తికర విషయాలు

ప్రతి శుక్రవారం హీరోలు..మారుతుంటారు..సంబంధాలు మారుతుంటాయ్..సినిమా వాళ్ల సెంటిమెంట్లు..వాళ్లు సక్సెస్ కి ఇచ్చే గౌరవం..సక్సెస్ కి వాళ్లిచ్చే నిర్వచనం గురించి డైరక్టర్, నిర్మాత తేజ చెప్పిన మాట. ఈ మాట  అతనిలో రగులుతున్న సంఘర్షణ నుంచి వచ్చిందే అని క్లియర్ గా తెలిసిపోతుంటుంది. ఎందుకంటే చిత్రం, నువ్వునేను జయం..ఈ మూడు సినిమాలే తేజకి గట్టి హిట్లుగా చెప్పాలి..కానీ ఆ మూడు సినిమాలే తెలుగు చిత్రగతిని మార్చేశాయ్..దాదాపు 300 సినిమాలా ఆ  ఒరవడిలోనే వచ్చాయ్..అంతెందుకు తేజనే తన సినిమాలనే తాను కాపీ కొట్టి తీశాడనిపిస్తుంది ఆ తర్వాత అతని సినిమాలు చూస్తే.. ఆర్పీ పట్నాయక్, సునీల్, తేజ, ఉష, ఇలా  ఎంతోమంది ఓ టీమ్ లా పని చేసారప్పట్లో..కానీ సక్సెస్ లేనిచోట నిర్మాతలుండరు..

అందుకే తేజ ఏ సినిమా చేసినా ఓ సంచలనం అనే స్థాయి నుంచి ఏది వస్తున్నా..ఇదీ పోయేదేనేమో అని కాదు..ఇక ఎందుకు తీయడం అనే స్థాయికి పడిపోయాడు..నేనే రాజు నేనే మంత్రి హిట్ మూవీ అంటున్నా..వరసగా సినిమాలు వచ్చిన దాఖలాలు లేవ్..లేదూ నేనే తీయడం లేదని తేజ చెప్పొచ్చు కానీ..సక్సెస్ ఓన్లీ స్పీక్స్...సినిమాల్లో అయితే వరసగా వచ్చే సినిమాలే దానికి నిదర్శనం.
అలాంటి తేజ మొన్న ఓ ఇంటర్వ్యూలో కొంతమంది సెలబ్రెటీల గురించి తనకి తెలిసిన నిజాలు చెప్పాడు..వాటిలో మొదటిది మన సూపర్ స్టార్ మహేష్ గురించి..మహేష్ అంటే డైరక్టర్స్ హీరో..అతను డైరక్టర్ దూకేయ్ అంటే చాలు దూకేస్తాడు..ఏ పాత్రఅయినా అద్భుతంగా పోషిస్తాడని చెప్పాడు..ఇది మహేష్ ప్యాన్స్ కి ఆనందం కలిగించే విషయమే..కానీ అలాంటి మహేష్ ఎక్కువ సినిమాలు చే స్తే..ఎక్కువ మంచి సినిమాలు వస్తాయని అంటాడు తేజ..
తనతో పరిచయం కాబడినవారు తనకి కూడా అందనంత ఎత్తులో ఉన్నారని చెప్పిన తేజ..ఈ సందర్భంలోనే సల్మాన్ ఖాన్ గురించి ఓ విషయం చెప్పాడు.. తనని పరిచయం చేసిన( హీరో) రాజశ్రీ ప్రొడక్షన్స్ కి  సల్మాన్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడని...అందుకే ఇప్పటికీ ఏ సిినిమా సైన్ చేసినా. అగ్రిమెంట్ కింద రాజశ్రీ వాళ్లు ఎప్పుడు పిలిచినా వెళ్లిపోతాననే షరతు రాసి సంతకం పెడతాడని తేజ చెప్పాడు..అలాంటి కమిట్ మెంట్ ఉన్నవాళ్లు తెలుగులో చాలా తక్కువ అని చెప్పాడీ సందర్భంలో ..నిజంగా సల్మాన్ కి అంత కృతజ్ఞత ఉందా..ఏమో తేజ చెప్పాడు కదా..

Comments