స్టాలిల్ ఝలక్..ఇంకేమేం గుళ్లున్నాయో తిరిగితే బావుండు ఫ్రంట్‌కి బొంగు లేదూ..టెంటూ లేదు


పాపం రెండోసారి గెలిచిన తర్వాత దేశంలో కూడా తన హవాకి తిరుగుండదనే ఓ  ముఖ్యమంత్రి...మోడీకి బీ టీమ్ అంటూ విమర్శలు వస్తుంటే తట్టుకోలేక ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాల పర్యటనకి బయల్దేరాడు..కానీ ప్రయోజనం ఏముంది..ఓ లేడీ..అసలు అప్పాయింట్ మెంటే ఇవ్వలేదు..మరో లేడీ వచ్చావ్ కదా బాసూ కాస్త నీళ్లు తాగెళ్లు అన్నట్లు బిహేవ్ చేసింది..మరో సిఎం నీరా తాగు గురూ అన్నాడు..ఇంకో లీడర్ మాత్రం కూర్చోబెట్టి..ఎందుకు ఈ వయసులో నీకీ కష్టాలు..పైగా మేమంతా ఆల్రెడీ కాంగ్రెస్ బాటలోనే ఉన్నాం..నువ్ కూడా మాతో కలిసిపో..అంటూ
సలహా ఇచ్చేశాడట..
ఛత్..నీయవ్వ..ఇదేందిరా ఇట్టైంది..అనుకుంటా మనోడు ఇంకే గుళ్లున్నయ్యో తిరుక్కుంటే సల్లంగా ఉండొచ్చు కదా
అని ఫ్యాన్స్ అనుకుంటుంటే..హే..లేదబ్బా..మార్పు వచ్చేస్తుంది..చూడు..ఇప్పుడు కాకబోతే..2024లో అయినా మనవే గదా..సక్రాలు తిప్పేది అనేది అధినేత అబిమతం కావచ్చు..ఈ ఊరి దొర పక్కూర్లో పాలేరన్న సామెత ఎన్నిసార్లు  చెప్పినా మనోళ్లకి గుర్తుండదు..ఎందుకంటే..పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని నమ్ముతుంటారు కదా..ఇదే సామెత ఏ మోడీకో..స్టాలిన్‌కో చెప్పి చూడండి..వెంటనే ఫాలో అవుతారు..అందుకే బాసూ..వాళ్లెవరూ ఎక్కడక ీపోరు..కావాల్సినవాళ్లనో తమ కాళ్ల దగ్గరకి రప్పించుకుంటారు
ఏదైనా ఇలాంటి విషయాల్లో చంద్రబాబుని మెచ్చుకోవాలి..అయినా కాకపోియినా..తానేదో చేస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడంలో మొనగాడు..ఈ బిల్డప్  విషయంలో మాత్రం పెయిలవడు..ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి కూడా ఇదే పంథా..తానెవరినీ కలవడు..తన దగ్గరకే రప్పించుకుంటాడు..ఐనా..మనకొచ్చే ఏ పదో పరకో సీట్లకి టెంట్లెందుకు బాసూ అని కొంతమంది ఈసడించుకోవచ్చు కానీ...ఎంత దూరదృష్టి లేకపోతే..ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు మన లీడర్లు..

Comments

  1. This is exactly what Congress and BJP had in mind when they conspired to divide AP. Each party of Telugu states has 5 to 15 MP s and no weight and influence.

    ReplyDelete

Post a Comment