టీవీ ఛానల్స్ తీరు హేయం..పశ్యరామిరెడ్డికి లేదు చోటు


నటుడు రాళ్లపల్లి చనిపోయాడనే వార్త వచ్చిందో లేదో వెంటనే సదరు వ్యక్తి సినిమాలు...నేపధ్యం..ఆయన ఘనతలు బ్రేకింగ్సు రూపంలో వేసుకుంటూ..అతని సినిమా క్లిప్పింగ్స్ సైడ్ వేసి..నేనే ముందు వేసా..నేనే ముందు వేసానంటూ
జబ్బులు చరుచుకునే ఛానళ్ల నుంచి ఇంతకంటే ఏం ఆశించగలం

రాత్రైంది..ఈ టైమ్ లో ఎవరికైనా ఫోన్ చేయాలంటే బంధువులకు చేసి చెప్తారు..కానీ మనోళ్లు మాత్రం సినిమా ఇండస్ట్రీలో తమ దగ్గరున్న పేర్లన్నిటికీ ఫోన్లు చేసి..మీరేమంటారు..మీరేమంటారు..మీ అనుబంధం ఏంటి..మీ ఎక్స్ పీరియెన్స్ ఏంటి..అంటూ చావగొట్టడం..నాకైతే..ఏదోక రోజు..మా బాధలో మేం ఉంటే..మీ అభిప్రాయసేకరణ ఏంటి అని ఎవరైనా రివర్స్ అవుతారేమో అన్పిస్తుంది..ఇందులో ఏదోటి చేసి వాళ్ల ఛానల్నే చూడాలనిపించే పేలాలు ఏరుకునే వరసే కన్పిస్తుంది కానీ..ఎక్కడా ఓ మనిషి చనిపోయాడనే బాధ సదరు ఛానల్స్ లో కన్పించదు..

ఇలాంటి సమయంలోనే రాత్రి  ఓ స్క్రోలింగ్ చూశా..తెలంగాణ ఉద్యమం..స్వాతంత్ర్య పోరాటం చేసిన పశ్యరామిరెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు అనేది దాని సారాంశం..ఆ వార్త గురించి ఆ ఛానల్ ఏదైనా న్యూస్ ఇస్తుందేమో అని చూశా..అలానే ఇతర ఛానళ్లు కూడా..కన్పించలేదు..తర్వాత పేపర్లు..సాక్షి. ఈనాడు. జ్యోతి అన్నీ తిరగేశా..ఒక్క చోటా రాలేదు..ఇదీ ఛానళ్ల ప్రాధాన్యతలు..అక్కడికేదో వినోదం కోణంలో రాళ్లపల్లి తక్కువ చేశాడని కాదు..కేవలం తమ వ్యూయర్ షిప్ పెరుగుతుందనే వార్తలకే తప్ప..మిగిలిన ఏ కోణాన్ని పట్టించుకోని తీరుని ఎత్తి చూపడమే ఉద్దేశం..
కింద ఫోటోలోని ఆయనే ఆ  రామిరెడ్డో కాదో చెప్పగలరు

Comments