ఈ ట్వీట్ చంద్రబాబు చేసిందేనా



ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ పట్టుకోవడంలో విఫలం అయ్యాయ్ అంటున్న చంద్రబాబుగారు పెట్టినట్లుగా ఓ ట్వీట్ సర్క్యులేట్ అవుతోంది..అందులో ఆయనే పెట్టి ఉంటారని కూడా అంటున్నారు. అందులో సారాంశం గురించి మాట్లాడుకుందాం ఎగ్జిట్ పోల్స్ జనం నాడి పట్టుకోలేకపోయారనే మాట..ఎన్డీఏ విషయంలో వాడారా లేక ఏపీ వరకూ వాడారా..
ఓ వేళ ఎన్డీఏ వరకూ వాడారనుకుంటే..ఆయన ఎన్ని రాష్ట్రాలు తిరిగాక ఆ మాట అంటున్నారు. తమిళనాడులో అసలు ప్రచారమే చేయలేదు..ఇక ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ..వగైరా చోట్ల పాదం కూడా మోపలేదు..మరి ఎలా చెప్తారు దేశ రాజకీయాల్లో బిజెపిికి ఎదురుదెబ్బ అని..సరే అది వదిలేద్దాం..ఏపీ వరకే చూసుకుంటే..టిడిపి గెలుస్తుందన్న సర్వేలు కూడా ఉన్నాయ్..అవి కూడా తప్పుగానే జనం నాడి పట్టుకున్నాయా..
ఇక్కడ ఇంకో విషయం గమనించండి..ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ పోల్స్ ఎక్కడా అవ్వవ్..దానిలో ఎలాంటి రెండో అభిప్రాయం లేదు కానీ...

కింద ట్వీట్ సరిగా గమనించండి..చంద్రబాబునాయుడుగారు రాత్రి ఆరుగంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయితే..ఉదయం 9.40 నిమిషాలకు ఎలా ట్వీట్ చేస్తారు..ఇది సాధ్యమా..వారే చెప్పాలి..వారి తరపున ఎవరో సమాధానం చెప్తే..సరిపోదు.ఇదెలా జరిగిందో కొంతమందికి(నాతో సహా) తెలుసు..కానీ ఆ విషయం ఆయన ట్విట్టర్
మెయిన్ టైన్ చేసేవాళ్లు చెప్పాలి..

Comments

  1. చెంద్రాలు సార్ గెలుస్తాడని బుడ్డోడు (పాలు తాగే వయసులోనే పాలమ్ముతూ కోట్లు గడించిన బుజ్జికన్న కాదు) చేసిన సర్వే. కామెడీ ప్రియులందరూ చదవాల్సిన మాంచి "స్టోరీ".

    https://muchata.com/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81/

    ReplyDelete

Post a Comment