రాహుల్ గాంధీ ఈసారీ సైడవ్వాల్సిందేనా...!

 
6 దశల పోలింగ్ పూర్తైన తర్వాత అటు యూపిఏ కానీ..ఇటు ఎన్డీఏ రెండూ పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయ్. ఈ దశలో కాంగ్రెస్ తమకి అనుకున్నని సీట్లు రాకపోతే ఏం చేయాలనే అంశం చర్చకు వస్తోంది. కూటమిలో ఇతర పార్టీలకే ఎక్కువ సీట్లు కనుక వస్తే..రాహుల్ ప్రధాని అభ్యర్ధిత్వం అనేది సైడ్ లైన్ చేయవచ్చనేది కూడా
ఇప్పుడు బాగా విన్పిస్తోన్న మాట. అసలు ఎన్నికలు మొదటి దశకి ముందే ఈ పాయింట్‌పైనే సమాజ్ వాదీ..బిఎస్పీలు కాంగ్రెస్ తో విబేధించాయ్. చివరి దశకి వచ్చేసరికి  ఆ అంశం
కాంగ్రెస్ కూడా అంగీకరించాల్సి రావడమే పోలింగ్ జరిగిన ట్రెండ్‌కి నిదర్శనంగా చూడాలి. 

 పశ్చిమ బెంగాల్‌లో లెఫ్ట్‌తో కలిసి పోటీ చేయగా ఢిల్లీలో సింగిల్ ఫైట్‌ తో సరిపెట్టుకుంది. ఉత్తరప్రదేశ్‌లోనూ బహుముఖ పోరే నడిచింది. ఒక్క బిహార్, తమిళనాడు, కర్నాటక, పంజాబ్, 
హర్యానా,మహారాష్ట్ర, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో మిత్రులను సంపాదించుకుంది కాంగ్రెస్. సీన్ ఇలా ఉన్న నేపధ్యంలో కాంగ్రెస్‌కి 190 నుంచి 200 సీట్లు వస్తేనే
ప్రధాని అభ్యర్ధిగా రాహుల్ గాంధీని ప్రొజెక్ట్ చేయడానికి స్కోప్ ఉంది. లేదంటే మిత్రపక్షాల్లోని ఎవరో ఒకరికి ప్రధాని పదవిని సమర్పించుకోవాల్సిందే..ఇక హిస్టరీ చూసినా..సంకీర్ణ ప్రభుత్వాల సమయంలో
అంటే 1989లో కాంగ్రెస్ 197 సీట్లు గెలిచింది. జనతాదళ్ ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చింది. 1991లో ప్రభుత్వం పడిపోగానే..తిరిగి ఎన్నికలకు వెళ్లింది. అప్పటి ఎన్నికలలో 244 సీట్లు గెలవగలిగింది. దీంతో 
జార్ఖండ్ ముక్తి మోర్చా సహా పలువురు జంప్ జిలానీల మద్దతుతో హ్యాపీగా ఐదేళ్లూ ప్రభుత్వాన్ని అప్పటి ప్రధాని పివి నరసింహారావ్ నడపగలిగారు. ఆ తర్వాత 1996,98,99లో అధికారానికి దూరమైంది కాంగ్రెస్
తిరిగి 2004లో 145 సీట్లు గెలిచిన కాంగ్రెస్..మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత 2009లో ఇంకాస్త బెటర్‌ పెర్ఫామెన్స్‌తో 206 సీట్లు గెలిచింది. దీంతో వరసగా రెండోసారి యుపిఏ
గవర్నమెంట్ పగ్గాలు దక్కించుకుంది. 

 ఐతే 2014లో మాత్రం ఒక్కసారిగా 44 సీట్లకి పతనమైంది. ఇప్పుడు తిరిగి అధికారానికి చేరువ కావాలంటే..కనీసం యూపిఏ-1 హయాంలోలాగా..మరో వంద సీట్లు అదనంగా గెలవాలి..ఐతే కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్..ప్రధాని అవ్వాలంటే మాత్రం ఈ విన్నింగ్ సరిపోదు..కనీసం 190 గెలవాలి..అప్పుడే కాంగ్రెస్ చెప్పుచేతల్లో ఆ పార్టీ మిత్రపక్షాలు ఉంటాయ్...లేదంటే మాయావతి..అఖిలేష్ యాదవ్ కూటమికి 25 సీట్లు..మమతాబెనర్జీకి 35 సీట్లు..ఆర్జేడీకి 15సీట్లు..ఎన్సీపీకి 10 సీట్లు వస్తే..కాంగ్రెస్ ఈ పార్టీలను ఆడించడం మానేసి..అవే కాంగ్రెస్‌ని ఆడించడం ప్రారంభిస్తాయ్..ఐతే ఈ సిచ్యుయేషన్‌ని ఊహించే కాంగ్రెస్ అధిష్టానం పావులు కదపడం ప్రారంభించిందంటున్నారు. ఏకే ఆంటోనీ, అశోక్ గెహ్లాట్, చిదంబరం, ఆజాద్ వంటి నేతలతో తమకి దూరంగా ఉన్న మాయావతి..మమత, కేజ్రీవాల్‌తో చర్చలు జరిపేందుకు స్కెచ్ వేసినట్లు కన్పిస్తోంది..ఇప్పటికే ఈ నేతలంతా వారితో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది.. బిజెపిని అధికారానికి దూరంగా ఉంచడమే వీరి లక్ష్యం కాబట్టి..ఇదే సింగిల్ పాయింట్‌తో  యూపిఏ-3 ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం అవసరమైతే..ఫెడరల్ ఫ్రంట్ నేతలుగా ప్రచారం సాగుతోన్న కేసిఆర్, జగన్, నవీన్ పట్నాయక్ వంటి లీడర్లతో కూడా చర్చలకు కాంగ్రెస్ సై అంటుండటమే విశేషం. 

Comments