ఓడిపోయినా...నారా లోకేష్ సేఫ్


ఊహించినట్లుగానే..(ఎవరని అడక్కండి) నారా లోకేష్ గారి రాజకీయజీవితం సేఫ్‌గా సాగబోతోంది..టిడిపి ఇంతవరకూ గెలవని సీటులో నిలబెట్టడం గర్వకారణంగా ఉందంటూ మొదలుపెట్టిన ఆ ప్రయాణం చివరికి ఓటమితోనే ముగిసింది. ఐతే ఇది ఎమ్మెల్యే అభ్యర్దిగానే..ఇది ఊహించారు కాబట్టే..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయలేదాయన.. ఆళ్ల రామకృష్ణారెడ్డి గత మెజారిటీ ఏ 53 ఓట్లో అయితే..ఇప్పుడు 5వేలకి పైగా పెరిగింది..పైగా నేను పిలుపు ఇచ్చాను..జనం వరదలా వచ్చి ఓట్లేశారు..అర్ధరాత్రి వరకూ వేశారు అంటూ చంద్రబాబు అండ్ కో పలికిన పలుకులలో నిజం ఎంత ఉందో జనం ఇప్పుడు చక్కగా బహిరంగంగా ెచెప్పవచ్చు కూడా..బాబూ మేం ఓట్లేసింది నీకు కాదూ అని

మందలగిరిలో ఓటమిని సింపుల్ గా తెలుగు తమ్ముళ్లు సెంటిమెంట్‌కి అంటించి తప్పుకోవచ్చు..ఎటూ ఎమ్మెల్సీగా పదవీకాలం ఉందికాబట్టి నారా లోకేష్ ఫ్యూచర్ కి వచ్చిన ఢోకా లేదు..ఈ  ఓటమికి కారణాలను రెండు రోజులు ఆగితే ఏ ఈవిఎంలపైనో తోయవచ్చు..లేదూ రిగ్గింగ్ చేసారని ఆరోపించవచ్చు..కానీ మంత్రి సోమిరెడ్డి సారీ..ఇక మంత్రి కాదు కదా..సోమిరెడ్డి చేత బలవంతంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి..బరిలో దింపారు..వరసగా నాలుగోసారి ఆయన ఓడిపోయాడు..ఇప్పుడేగతిన ఏడ్వాలి ఆయన..

సోమిరెడ్డికో నీతి..లోకేష్ కి ఓ నీతా..ఇలాంటి చెత్త పనులు చేస్తారు కాబట్టే..ఇప్పుడు ఓడిపోయిన టీడిపి లీడర్లు కూడా బాబుకి బాగా అయిందని లోలోపల ఆనందపడుతున్నారట. ఇప్పుడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా అసెంబ్లీలో లోకేష్ ని ఏడిపించకుండా ఉంటారా..డైరక్ట్ గా గెలవకుండా..మంత్రివి  అవడానికి మీకున్న అర్హత చంద్రబాబు పుత్రరత్నం అనేగా అనే మాటలకు ఎలా రియాక్ట్ అవుతాడో పాపం..తెలుగు తమ్ముళ్లు..ఫేస్ బుక్కులలో మీ ఆక్రోశం తీరిగ్గా  ఐదేళ్లు వెల్లిబుచ్చుకోవడానికి కావాల్సినంత టైమ్ దొరికింది

Comments