ఏపికి జగన్ సిఎం..తెలుగు రాష్ట్రాలలోనే ఇదో రికార్డు ఎలాగంటే


వాస్తవానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి విషయంలో రికార్డు క్రియేట్ చేసారు..కాకపోతే వీటికి గిన్నీస్ బుక్ లాంటిది లేదు కాబట్టి..గుర్తింపు ఉఁడదు..పార్టీ పెట్టిన ఆరునెలల్లోనే బై ఎలక్షన్స్‌లో రెండు పార్టీల డిపాజిట్లు గల్లంతు చేయడం ఆయనకే సాధ్యమైంది..ఎంపిగా రికార్డు మెజారిటీ సాధించడమూ గుర్తుండే ఉంటుంది..

ఐతే ఇప్పుడు చెప్పుకునే రికార్డు మాత్రం సమీపకాలంలో సాధ్యమయ్యేది కాదు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కాదు..విడిపోయిన తెలుగు రాష్ట్రాలు..కలవక ముందు మద్రాసు తెలుగు రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం, ఇలా ఏ తెలుగు రాష్ట్రంలో అయినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రికార్డు ఫస్ట్ ఆఫ్  ఇట్స్ కైండ్..కావాలంటే బెట్..ఇది మనం రాసుకున్న తర్వాత..చెప్పుకున్న తర్వాతే ఏ ఛానల్ అయినా..ఏ వెబ్ సైట్ కాపీ కొట్టుకుని రాసుకుంటారు చూడండి

ఇంతవరకూ ఏ ముఖ్యమంత్రి కొడుకూ మళ్లీ ముఖ్యమంత్రి అయిన దాఖలా లేదు..తెలుగు రాష్ట్రాలలో..చివరకు బాబాయిలు..అబ్బాయిలైనా సరే..ఒక్క వైెఎస్ కుటుంబానికే ఇది సాధ్యమైంది..మరి నారా లోకేష్ గారు అయ్యే  అవకాశం తెలుగు ప్రజలు ఇస్తారో లేదో కానీ..ఇప్పటికి ఇదే రికార్డు..కేసీఆర్ తప్పుకుని కేటీఆర్ కి ఇచ్చినా అది నామినేటేడె సిఎం పోస్టే..ఓకే..అలా అయినా అయినవరకూ జగన్ మోహన్ రెడ్డిదే రికార్డు ..ఉత్తరప్రదేశ్ లో ములాయం కొడుకు అఖిలేష్ అయ్యాడు..కర్నాటకలో దేవెగౌడ కొడుకు కుమారస్వామి అయ్యాడు..మహారాష్ట్రలో ఇలా అయిన దాఖలా ఉన్నట్లుంది..మాధవ్ రావ్ సింథియా కొడుకు జ్యోతిరాదిత్యకి మాత్రం కాంగ్రెస్ ఆ అవకాశం దక్కకుండా 2018లో బ్రేకేసింది..వాస్తవానికి 2009లోనే జగన్ ని సిఎం చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదు..ఐతే సొంతంగా పార్టీ పెట్టుకుని జగన్ ఇప్పుడు స్వయంశక్తితో సిఎం అవగలిగాడు..ఇంకా ఉత్తరాదిన దేవీలాల్ కొడుకు ఓం ప్రకాష్ చౌతాలా..ఎట్సెట్రా అయ్యారు ఇదీ సంగతి

Comments