జగన్ పై సుప్రీంకోర్టులో పిల్ అట...హ హ హ పచ్చ బ్యాచ్ శునకానందం



మురారి సిినిమాలో ఓ సీన్ గుర్తుందా..బుల్లిబాబుగాడూ పే..ద్ద గడ్డపార తీసుకుని బయలుదేరతాడు..పక్కన కేతిగాడేమో బ్బాబ్బాబ్బా..ఆ మురారిని ఏం చేయమాక...వదిలేసేయండి బాబుగారూ అంటూ బతిమాలుతుంటే..సడన్ గా ఆగిపోయి..బుల్లిగాడు మురారి జీపులో గాలి తీసి సంబరపడతాడు..ఇప్పుడలానే తయారైంది పిచ్చ పచ్చ బ్యాచ్..జగన్ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకోవాలంటూ ఓ పిల్ వేసినట్లు..దాన్ని వీోళ్లు జస్ట్ రిపోర్ట్ చేస్తున్నట్లూ బిల్డప్ ఇస్తూ..ఓ ఫేక్ పోస్ట్ సర్క్యూలేట్ చేస్తున్నారు

సుప్రీంకోర్టులో అలాంటి పిల్ ఏదీ ఎవరూ వేయలేదు..ఇవాళ మధ్యాహ్నం 12.30కే లంచ్ మోషన్స్  అన్నీ పూర్తయ్యాయ్ కూడా..ఎలాంటి పిటిషన్స్ పెండింగ్ లేవు..ఐనా ఇలా పచ్చానందం పొందుతున్నారంటే అది పాపం
ఓటమి జీర్ణించుకోలేక..తిన్నది అరాయించుకోలేక నానా అగచాట్లు పడుతోన్న బ్యాచ్ పనే అని అర్ధమవుతోంది..కనీసం ఇలాగైనా కాస్త బైటికి వచ్చి సొల్లు వాగడానికి పనికి వస్తుందేమో కానీ..అసలు కోర్టు ఇలాంటి పిటీషన్స్ తీసుకునేదే లేదు

పిటీషన్స్ తీసుకోవడం అటుంచి..నీకేంటి అంత పబ్లిక్ ఇంట్రస్ట్ అని ఓ పదివేలు ఫైనేసినా వేస్తుంది..కేసులు ఉండటం వేరు..నిరూపణ అవడం వేరు..ఎలాగైతేనేం పచ్చ బ్యాచ్ కి కాస్త బైటికి రావడానికి ఓ సాకు దొరికింది అంతే..ఆ..అన్నట్లు..హైదరాబాద్‌లో ఎన్టీఆర్ సమాధి దగ్గర ఆ హడావుడేంటంట..చంద్రబాబుగారు తన వంధిమాగధులతో హాజరైపోయి..పాత రికార్డు వేసినట్లున్నారే...ఆ...ఏంటీ...హల...హల...బాబుగారు అసలు రాలేదా...పార్టీ ఆఫీస్ లో ఘనంగా నివాళులు అర్పించేశారా...అదేంటి...హైదరాబాద్‌కి రావడం ఇప్పుడంత మంచిది కాదనా...సరే సరే...ఓకే


Comments

  1. చెట్టు కింది ప్లీడర్లు ఎన్ని "పిల్లులు" మింగినా అజీర్తి తప్ప ఒకింతయూ లాభము లేదని సర్వశాస్త్రములు ఘోషించుచున్నవి. ఈ పచ్చ బాచీ ఎంత చొక్కా చింపుకున్ననూ ఇసుమంతయినా ప్రయోజనం ఉండజాలదు. ప్రమాణ స్వీకారం తధ్యము, అటు పిమ్మట గత అయిదేళ్ల కుంభకోణాలపై దర్యాప్తు నిక్కము.

    ReplyDelete
    Replies
    1. ప్రమాణ స్వీకారం తధ్యము, అటు పిమ్మట గత పదేళ్ళ కుంభకోణాలపై దర్యాప్తు నిక్కము.జగమ్ము గడ గడలాడుట మోదము.గుట్టలో చచ్చినా గులాం జల్లుట మానము.

      Delete

Post a Comment