మెచ్చితే జనం ఎలా నెత్తిన పెట్టుకుంటారో చూడండి జగన్ క్రేజ్


వైఎస్ జగన్..ముఖ్యమంత్రి ఏపీ..నేమ్ ప్లేట్ ముందే తయారైందని..బ్యానర్లు కట్టారని తెగ వాపోయిన జనానికి ఇప్పుడా అవకాశం లేదు..ఎందుకంటే ఆ మాట నిజమైంది కాబట్టి..కానీ ఆంధ్రప్రజలకు నచ్చితే ఎలా నెత్తిన బెట్టుకుంటారో తెలిపే క్షణం ఇది..150 సీట్లు గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు..ఆంధ్రప్రదేశ్ 2009లో వైఎస్సార్‌కి ఎన్ని సీట్లు కట్టబెట్టారో అన్ని సీట్లు విడిపోయిన నవ్యాంధ్రలో ఇవ్వడమంటే జనం  జగన్ని ఎంతగా కోరుకున్నారో...బాబుకి బై చెప్పడానికి ఎంత ఆత్రపడ్డారో తెలుస్తుంది.. కాదు అని చెప్పి కారణాలు వెతకొద్దు..ఎందుకంటే వాళ్లకి పవన్ కల్యాణ్ రూపంలో ప్రత్యామ్నాయం కన్పిస్తోంది..అయినా జగన్ వైపే మొగ్గు చూపారంటే ఆయన క్రేజ్ అది..

ఎవరెన్ని మాటలు అన్నా..ఎన్ని కార్టూన్లు వేసినా..ముఖ్యంగా రెండు పత్రికలలో ఏ రేంజ్ లో కథనాలు చివరిరోజుల్లో (ఎన్నికలకు ముందు) వండివార్చారో తెలిసిందే..ఇకపై రాయరనేం లేదు..కానీ అప్పటికప్పుడు బైటికి వస్తాయ్..ఎన్నికలు అయిపోగానే పట్టించుకోని కొన్ని ఈడీ కేసులు..లేఖలు..సిబిఐ అభ్యర్ధనలూ అన్నీ అప్పుడే వచ్చేది..ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోరు..

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2014లో ఓడిపోయిన తర్వాత కొన్ని సందర్బాలలో చెప్పిన మాట..నాకు కడపలో వచ్చిన మెజారిటీ అంత లేదు టిడిపి-బిజెపి-కూటమికి వైఎస్సార్ కాంగ్రెస్‌కి మధ్య ఓట్ల తేడా అని..నిజంగా ఇదే కాంబినేషన్ ఈక్వేషన్ పై గతంలో కూడా అనేకసార్లు చెప్పాం..అదే నిజమైందో..లేక యూటర్న్ బాబు...పవన్ నాటకాలపై విరక్తే పుట్టిందో కానీ..జనం అమోఘమైన తీర్పు ఇచ్చారు..ఈ తీర్పు ఇలానే రేపు పంచాయితీలు..మున్సిపాలిటీల్లో కంటిన్యూ అవ్వాలని లేదు..ఎందుకంటే ఏ ఎన్నికలకు అవే భిన్నమైనవి..అంత మాత్రాన జగన్ పనైపోయిందని రాసుకునేపత్రికలకు అవకాశం రాదనీ లేదు..( తొందరేం లేకపోయినా..వాటి నైజం గురించి ఇప్పుడే మాట్టాడుకుంటే ఓ పనైపోద్దిగా)

Comments