జగన్ వెంట నడిచిన నటులకు ఇప్పుడు క్రేజ్


ఫృథ్వీరాజ్, కృష్ణుడు, పోసాని కృష్ణ మురళి, ఆలీ, శ్యామల, కెమెరామెన్ చోటా..వీళ్లపై జగన్ కి మద్దతు ప్రకటించిన సమయంలో వచ్చిన విమర్శలు అన్నీ ఇన్నీ కాదు..డబ్బుకోసం అమ్ముడుపోయారని..అన్నారు..కానీ ఇప్పుడు మాత్రం భలే లక్కీ ఛాన్స్ అంటున్నారు..
పార్టీలలో నటులు చేరడం ఓ కామెడీ సబ్జెక్ట్‌గా మారిన తరుణంలో ప్రతిపక్షంలో చేరడం గమనించాల్సింది..గుర్తించాల్సింది కానీ..టిడిపి కానీ ఆ పార్టీ అభిమానులు కానీ..వైఎస్ జగన్‌ని కలిసిన పార్టీలో చేరిన నటులుపై రాళ్లు వేయడం చీప్ గా మాట్లాడటం చేశారు. పార్టీలో చేరిన ప్రతి నటుడు..లేదంటే నటిపై అసభ్యంగా మాట్లాడటం ప్రారంభించారు..దాంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా రివర్స్ అవడం చూశాం..


 కానీ..ప్రతిపక్షంలో ఉన్న నేతలను కలవాలని ఆ పార్టీలో చేరాలని ఎఁదుకు అన్పించిందో ఒక్కసారి ఆలోచించినట్లైతే జనంలోని మార్పును వెంటనే గ్రహించి ఉండేవాళ్లు..వైెఎస్సార్ కాంగ్రెస్ లో చేరడమేదో డబ్బులు కోసం అని అనుకున్నవాళ్లకి ఈ ఎన్నికలు పెద్ద చెంపపెట్టు..ఏ  పార్టీ అధికారంలోకి వస్తుందో వారికి ముందుగానే సంకేతాలు అందాయి కాబట్టే.. ఆ పని చేయగలిగారు..దీనికి ఎవడికి తోచిన భాష్యం వాళ్లు చెప్పుకోవచ్చు..
 ఎమ్మెల్యేలు చంద్రబాబుతో చేరడం అభివృధ్ది అని చెప్పుకున్నవాళ్లకి చివరికి చేతికి చిప్ప వచ్చిన సంగతి గ్రహించకుండా..ఇంకా వితండవాదనలు చేస్తే..ఇదే ఫలితాలు రిపీట్ కావచ్చు..జనంలో వ్యతిరేకత గ్రహించకుండా..మా పార్టీ..మా కులం..మా హీరో అనుకుంటే..తప్పు..జననాడికి టిడిపి దూరం అయ్యింది ఇందుకే..జనంలో తిరగకుండా..పైపైన సర్వేలు తెప్పించుకుంటే అవి ఖచ్చితంగా మానిప్యులేట్ అయి..అధినేత చేతికి తప్పుడు నివేదికలే వెళ్తాయ్..జస్ట్ చిన్న ఎగ్జాంపుల్..వనజాక్షి అనే అధికారిపై ఎమ్మెల్యే జులుం ప్రదర్శించినప్పుడు 40 ఏళ్ల అనుభవం ఉన్న నేత..ముందు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా కమిటీలు వేస్తే..ఏ ఉద్యోగికైనా కడుపులో మండదా..నువ్ చర్యలు తీసుకోవడం అంటే ఏదో పెద్ద పార్టీ నుంచి బహిష్కరించడంలాంటి చర్యలు తీస్కోవాల్సిన అవసరం లేదు..జస్ట్ మూడు నెలలు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేవా...కళ్లముందు వాస్తవం కన్పిస్తుంటే..కమిటీలతో కాలయాపన చేసి..జనం మర్చిపోతారనుకుంటే ఎలా
 రాష్ట్రంలో ఎన్ని ఉదంతాలు ప్రముఖంగా టిడిపికి వ్యతిరేకంగా కన్పిస్తున్నా...దాన్ని లైట్ తీసుకోవడం వలనే ఆ పార్టీకి ఈ దుస్థితి పట్టింది..ఏదో పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేయడం వలన దెబ్బతిన్నాం  అని మింగలేక మంగళవారం సాకులు చెప్పుకోవద్దు..అదే ఓ వేళ కలిసి పోటీ చేస్తే...ఇంతకి మించి ఓడిపోయేవాళ్లు... ఈ వాదనని కాదనుకుంటే..ఆ పార్టీ ఖర్మ..ఎందుకంటే 2014లో కలిసే కదా...హీరోలైంది..ఇప్పుడూ కలిసి వచ్చి జగన్ పై హోదా ఫైట్ చేసి ఉంటే తెలిసేదీ ఆ ఫలితం కూడా..ఈ విషయాలన్నీ సినిమాజీవులు తెలుసుకున్నాయ్ కాబట్టే...ఏళ్లుగా రాజకీయం చేస్తోన్న నేతలకంటే బ్రహ్మాండంగా ఇప్పుడు టిడిపి తప్పులను ఛానళ్ల ముందు కడుగుతున్నారు..

Comments