బాబ్బాబ్బూ..మమ్మల్ని కలుపు..ఎవరో ఒకర్ని పిఎం చేయి..లేదంటే నువ్వైనా అవ్వు


543 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఇక మిగిలింది గట్టిగా వంద సీట్లు..అంటే ఈపాటికే సంకేతాలు నిజమైన సర్వేలు
చేయించుకున్నవాళ్లకి తెలిసి ఉంటుంది ఎవరెవరు గెలుస్తారనే అంశంపై. ఇలాంటప్పుడు ఓ నేత ఢిల్లీ బయలుదేరారు..ఆయన ప్రతిసారీ కలిసే లీడర్లనే కలిశారు..వాళ్లూ ఈయనకో షేక్ హ్యాండ్ పడేసి..నవ్వారు..

ఇక బయలుదేరింది అప్పుడు మన భజన బృందం..అదిగో మావాడు వచ్చేశాడు చూశారా..పెద్దపెద్దోళ్లే మావాడి సాయం అడిగారు..బాబ్బాబ్బా..ఎట్టాగైనా మమ్మల్ని కలుపు..మాలో ఒకరిని ప్రైమ్ మినిస్టర్ని చేయి..లేదంటే నువ్వైనా అవ్వు..అంతేకానీ బాబూ ఆ మోడీని మాత్రం మళ్లాీ ప్రధానమంత్రిగా భరించలేం మేం అంటూ మొరపెట్టుకున్నారు...అచ్చంగా ఇదే కాదు కానీ..ఇదే స్టైల్లో స్టోరీలు హోరెత్తిస్తున్నాయ్..

ఎన్నికలకు ముందు కర్నాటక సిఎఁ ప్రమాణస్వీకారోత్సవంలో ఓ పది పెద్ద పార్టీలు కలిశాయ్..  ఆ తర్వాత ఎవరికి వారే నేనే పిఎం కాండిడేట్ ని అంటూ విడివిడిగా పోటీ పడ్డాయ్..కేజ్రీవాల్, మమతబెనర్జీ, మాయావతి, రాహుల్ గాంధీ
దేవెగౌడ( వాళ్ల కొడుకు చెప్తాడు మరి), ములాయం(అఖిలేష్ ఆశ), శరద్ పవార్..ఇలా ప్రతి ఒక్కళ్లూ కాలం కలిసి వస్తే మేమే ప్రధానమంత్రి అవుతామంటారు..ఐతే వీళ్లలో ఎక్కువమంది మోడీ కాకపోతే...అవుతారని అనుకుంటుంది మాత్రం రాహుల్ గాంధీనే..ఎందుకంటే 130 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అంత తొందరగా చావదు..దాని వేళ్లు అంతగా దేశమంతా పాకిపోయాయ్..చెడు చేసినా..మంచి చేసినా ఆ పార్టీనే చేసింది. మిగిలిన పార్టీలు జనాన్ని పీడించుకుని తినడం తప్ప...కాస్త ఊరటనివ్వలేదు..అందుకే ఎంత మంచి పాలన ఇచ్చినా...లంచాలు తీసుకోకపోయినా( కనీసం ఆపేరు  ఉంది ) బిజెపి కానీ..మిగిలిన పార్టీలను వరసగా జనం గెలిపించలేదు..

ఇలాంటి సమయంలో రాష్ట్రంలో ఓటమి తప్పదనే భయంతో బాబుగారు( వాస్తవానికి ఆయన గెలుస్తాడో లేదో తెలీదు) ఓ పేద్ద దీర్గకాలిక వ్యూహంలో సెంటర్‌లో ఏంచేసినా  అది తన పుణ్యమే  అనుకోవడానికి నానాయాతనలు పడుతున్నారు. మోడీ వస్తే తన మాడు పగులతుందని తెలుసు..ఎందుకంటే మిగిలిన రాష్టాలతో పోల్చితే..కాస్త చంద్రబాబునే దయతలిచారు..లేదంటే ఈయనపై కూడా సిబిఐ దాడి..చెకింగ్ లాంటివి చేయించేవాళ్లు..అందులోనూ ఇప్పుడు ఆయన స్టే తెచ్చుకున్న కేసులు తిరిగి దర్యాప్తు ప్రారంభం అవుతున్నాయ్..కాబట్టి..మోడీని అడ్డుకోవడం ఇతర పార్టీలకు రాజకీయఅవసరం కాగా...బాబుకి మాత్రం భవిష్యత్తు అవసరం..ఎందుకంటే ఓ సారి లోపలపడితే...ఇక వైఎస్ జగన్ పై చేస్తున్న ఆరోపణలకు..ఈయనకు అంతరం పూర్తిగా చెరిగిపోతుంది..పైగా 70 ఏళ్ల వయసులో జైలు జీవితం జీర్ణించుకోవడం కష్టం..లోపల ఎలాంటి ట్రీట్ మెంట్ ఉంటుందన్నది తర్వాత సంగతి కానీ జైల్లో పడ్డారనే వాస్తవం కర్ణకఠోరం. టిడిపి ఏపీలో గెలిచినా...కేసులు వెంటాడితే జయలలిత..మధుకోడా, లాలూ ప్రసాద్ ల విషయంలో ఏం జరిగిందో చూశాం కదా..అందుకే ఇప్పుడు రాజకీయ సమీకరణాలలో తనకి ముప్పు రాకుండా..ఆపసోపాలు పడుతున్నారు..దానికి మన టీవి ఛానళ్లు కూడా యధావిధి సహకరిస్తూ.."బాబుగారు చెప్పినట్లు మాయావతి కుమారస్వామి కలిసి రాహుల్ తో మాట్లాడుతున్నారు..బాబుగారు వెళ్లి మమతాబెనర్జీతో రాహుల్ గురించి చెప్పారు.." వాళ్లిక కలవబోతున్నారు..ఇక చూస్తే..ఇదంతా చంద్రబాబుగారి చాణక్యమే...మోడీకి 170లోపే సీట్లు వస్తాయి..ఆ పరిస్థితే వేస్తే టిడిపినే కీలకం కాబోతోంది..ఇలాంటి అభిభాషణలు వ్యక్తం చేస్తున్నాయి

ఇంకా కామెడీలాంటి స్టోరీ కింద చూడండి
యూపిఏకి 200 సీట్లు వస్తాయట..మిగిలిన 70 టిడిపి,ఎస్పీ, బిఎస్పీ..పార్టీలవి ఉంటాయనే అర్ధంలో రాసుకొచ్చారు..అలా కలిపినా ఎంతమంది అయ్యేది 280..మరి ఏ 170 సీట్లో సింగిల్ గా వచ్చే బిజెపి చేతులు ముడుచుకుని కూర్చుంటుందా..రాసేటప్పుడు కాస్త లెక్కలు సరిగా రాసుకుంటే అభాసుపాలు కారు కదా..పైగా అవకాశం పదిలం చేసుకోవాలట..ఈ మాత్రం వాళ్లకి తెలీదు మరి..కాంగ్రెస్ కి 125 వస్తే..మరి మిత్రపక్షాలు ఎవరు..వాటికి వచ్చే 70 సీట్లు ఎక్కడనుంచి రావాలి..లాలూ ప్రసాద్ ఆర్జెడీ..ఎన్సీపీ, డిఎంకే ఈ మూడే కదా ఆ పార్టీతో సన్నిహితంగా  ఉంటున్నది..అవి పోటీ చేసేదే 70 లేవు కదా..లేదూ సరిగ్గా ఉన్నా..అన్ని చోట్లా గెలిస్తేనే కదా..వచ్చేది..మీ తపన మీ తాపత్రయం అర్ధమవుతూనే ఉంది..కానీ ఇలా రాసుకున్నంత మాత్రాన సీట్లు రావు..జనంలో వాళ్లని గెలిపించాలని ఉంటే వస్తాయ్..కూటమి కట్టడం అంటే..మీరనుకున్నంత ఈజీకాదు మిత్రమా..అది తేలకనే కదా..రాహుల్ ని మిగిలిినవాళ్లు వదిలేసింది

Comments

  1. వీళ్ళ మామ కూడా 1989లో ఇట్లాగే కేంద్రంలో పొడిచేస్తా కుమ్మేస్తా అంటూ విర్రవీగాడు. తీరా ఫలితాలు వచ్చేసరికి సీఎం ఖుర్చీ కూడా మిగల్లేదు.

    ReplyDelete
  2. కేసీఆర్ కూడా వామపక్షాలను కలుపుకుపోదాం అని అడుక్కుంటున్నాడు కదా, కేసీఆర్ కుర్చీ లాగేయమని వీహెచ్ "పెద్దమ్మ తల్లి"కి మొక్కుకున్నాడంట, మొక్కుకోవడం కూడా చేతకాలేదు. కేసీఆర్ కుర్చీ లాక్కుంటే కేటీఆర్ వచ్చి కూర్చోడా ? విడదీసినోడికి కలవ(ప)డం ఎంత కష్టమో తెలియాలి కదా ?
    In front there is a crocodile festival !








    ReplyDelete

Post a Comment