మహర్షి..మరో బ్రహ్మోత్సవంగా మారకపోతే చాలు


సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఆయన సినిమా ఏది వస్తున్నా మంచి అంచనాలు ఉంటాయి..దానికి ముందు వచ్చిన సినిమా హిట్టా..ఫట్టా అనే మ్యాటర్‌తో వాళ్లకి పనిలేదు..ఒక్క ఫ్యాన్సే కాదు..మిగిలిన సిినిమా గోయెర్స్‌లో కూడా అంతే..ఎందుకంటే సూపర్ స్టార్ ఓ మాస్టర్ పీస్..ఇది ఒక్క మహేష్ బాబుకే కాదు..కృష్ణ విషయంలోనూ అదే జరిగింది. ఆయన కెరీర్‌లో హీరోగా చివరిసారిగా నటించిన ఎవరు నేను అనే మూవీకి కూడా ఏదో అద్భుతం జరగనుందా..మళ్లీ ఓ హిట్ కొడతాడా అనే ఆశతో ఫ్యాన్స్ చూసారు. వయసు దాటిన తర్వాత..ఓ దశలో అడుగుపెట్టిన తర్వాత మీరెంత మంచి సినిమా తీసినా..ఎంత బ్రహ్మాండంగా కష్టపడినా జనం వాటి జోలికి పోరు..అలానే కృష్ణకూడా
తన కెరీర్‌ని ముగించారు..లేదు ఇది కామా మాత్రమే అంటారు కూడా..ఎందుకంటే రెండు మూడేళ్ల క్రితం శ్రీశ్రీ అని
ఓ సినిమా చేశారు కదా..

ఇక ప్రస్తుతానికి వస్తే..మహేష్ బాబు మూవీ భరత్  అను నేను ఎంత పెద్ద హిట్టో చెప్పక్లర్లేదు..సినిమా కలెక్షన్లు ఎంత బీభత్సంగా వచ్చాయో కూడా తెలుసు..అసలు కలెక్షన్ల సంగతి పక్కనబెడితే..మహేష్ బాబుని తెరపై అలా చూస్తూ ఉండిపోతే చాలనే అభిమానులు కనీసం కోటిమంది ఉంటారు. ఇంత ఫాలోయింగ్ ఉంది కాబట్టే..ఇప్పుడు మహర్షిపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయ్..

ఇంతవరకూ బాగానే ఉంది, కానీ  సిినిమా ప్రమోషన్ల సంగతి చూస్తే..గతం గుర్తుకురాకమానదు..బ్రహ్మోత్సవం ముందు కూడా ఇలానే యూనిట్ అంతా వచ్చేసి ప్రేక్షకుల మీద పడిపోయి..ఏదో బ్రహ్మాండం బద్దలవుబోతోందనిపించారు..కానీ మూవీ ఒక్క షోతోనే భవిష్యత్తుని నేలకరిపించేశారు రివ్యూరాయుళ్లు కూడా
ఇప్పుడు అదే దృశ్యాలు కన్పిస్తున్నాయ్, ఏ ఛానల్ చూసినా మహేష్ బాబు ప్రమోషనే..అసలు సినిమా కనుక సూపర్ గా వచ్చిందని డిసైడైతే..మహేష్ బాబు ప్రమోషన్ కి వచ్చిన సందర్బాలు ఈ 20 ఏళ్లలో ఒకటో రెండో ఉంటాయ్..సినిమా తేడా కొట్టింది కాబట్టే..వీలైనంత సేఫ్ గా బయటపడదామని ఇలా చేస్తున్నారేమో అనే డౌట్ సర్వసాధారణంగా సినిమాపోకడలను గమనించేవారికి అనుమానం వస్తుంది..మరి మన అంచనాలను మహేష్ తప్పు చేస్తాడేమో మే9న ఈపాటికి తేలిపోతుంది
 కోట్లకి కోట్లు ఖర్చు పెట్టిన నిర్మాతల శ్రమని ఇలా తక్కువ చేయడం అభిమతం కాదు కానీ..ఆలోచనలు పంచుకోవాలనుకోవడంలో తప్పు లేదేమో..ఎందుకంటే మహేష్ బాబుని చూడగానే ప్రతి డైరక్టర్‌కి జనానికి ఏది కావాలో అది తీయాలనిపించదు..ఎన్నాళ్లనుంచో వాళ్లలో తయారు చేసుకున్న కథలకు నాయకుడు దొరుకుతాడు..అది వర్కౌట్ అవుతుందా లేదా చూడరు..ప్రయోగంలాంటిదేదో చేసేస్తారు..ఫలితం తేడా కొట్టేసరికి సారీ సర్ మహేష్  సర్ నన్నెంతో నమ్మారు..మళ్లీ ఆయనకో హిట్టివ్వాలి అంటూ ట్వీట్లు పెడుతుంటారు..ఎందుకంటే మహేష్ ఓ యాంటిక్..ఎలాంటి క్యారెక్టర్‌నైనా చేయగలిగిన ఏకైక తెలుగు నటుడు 

Comments

  1. It seems you wanted to use the word unique and instead used antique. I feel that MaheshB doesn't emote in normal scenes. In comedy scenes he overacts.

    ReplyDelete
    Replies
    1. లేదు యునిక్ అంటే ఏంటి..ప్రపంచంలో ఎవరికి వారే యునిక్..దానికి పెద్ద పోలిక అవసరం లేదు..ఆయన యాంటిక్ అంతే అందులో తిరుగులేదు..మనకి నచ్చని వాటిని ఓవర్ అనడం సహజమే

      Delete
    2. Do you mean "antique" or "antics"?

      Delete
  2. మహేష్ బాబుకి కథలు ఎంపిక చేసుకోవడం చేత కాదు. సినిమా నిజంగా బాగుందని తెలిస్తే తప్ప చూడలేము.

    ReplyDelete

Post a Comment