లగడపాటికి జగన్ సెక్యూరిటీ పెంచుతారా..సర్వే చెప్పిన టైమ్‌లో నూతన్ నాయుడు ఎందుకున్నాడు


లగడపాటి ఎక్కడ..ఇదీ ప్రశ్న తెలుగుజనంలో..జవాబు చెప్పడానికి కన్పించడాయె..ఫలితాలు రాగానే వస్తానన్నాడు..కన్పించలేదే నా రాజు అంటూ బెట్టింగ్ రాయుళ్లు కర్రలు పట్టుకుని తిరుగుతున్నారు( వాస్తవానికి పాపం ఆయనేం పందేలు కాయమని చెప్పలేదు కానీ మే 19 చెప్పకుండా..మే 18నే చెప్పి తర్వాత మళ్లీ నంబర్లు చెప్పి మాయం అయ్యేవాడిని ఏం చేయాలి) అంటే తీరిగ్గా ఇప్పుడు అన్ని లెక్కలు తేలిన తర్వాత వచ్చి ఏం చెప్తాడు

లగడపాటి మొన్న సర్వే నాలుగు రకాలుగా తప్పింది..ఒకటి ఘోరాతిఘోరం చంద్రబాబు -టిడిపి అధికారంలోకి వస్తుందని చెప్పడం..రిజల్ట్ ఫుల్ రివర్స్
రెండు..జనసేన అధినేత అసెంబ్లీలో అడుగుపెడుతున్నాడని చెప్పడం..ఈ సంగతి చెప్పడం ఏమో కానీ..అసలు ఆ సర్వే పలితాలు చెప్తున్నప్పుడు పవన్ ఫ్యాన్ నూతన్ నాయుడు లగడపాటి పక్కనే ఎఁదుకున్నాడు..ఏంటి అతని ఇంట్రస్ట్..వీళ్లిద్దరు కలిసి ఏ బిజినెస్ చేస్తున్నారు.

మూడు- తెలంగాణలో జనం కారుని కోరుకున్నారట..సిగ్గు ఉండాలి ఈ మాట అనడానికి ఫలితాలు చూశారా ఎలా వచ్చాయో..అంటే 2018లో చేసిన తప్పుని కవర్  చేయబోయి మరో తప్పు చేశావా పిచ్చ అంపైరూ..
నాలుగు-కేంద్రంలో హంగ్ వస్తుందని చెప్పడం..నీ బొంద వచ్చింది లగడపాటీ నువ్వెక్కడ అంటూ నీకోసం జనం తిరుగుతున్నట్లు ఎన్ని పోస్ట్ లు పెట్టారో గమనించావా
ఇప్పుడు చెప్పండి సాబ్..మీరు ఇక సర్వేలు ఆపేస్తారా..ఎందుకంటే ఆ ప్రెస్ మీట్లో మీరదే  చెప్పారు..ఇది తప్పైతే ఇక నేను చేయనేమో..చేయకూడదు మరి అంటూ..చెప్పు 

Comments