ఆ పని చేయకు జగన్..వాళ్లని అక్కడే ఉండనీ


మే 23...23...3...3.. ఈ నంబర్లు మళ్లీ ఇప్పుడు ప్రస్తావించక్కర్లేదు..ఈ పాటికి అర్ధమయ్యే ఉంటాయి. చాలామందిలో మెదులుతోన్న డౌట్..టిడిపిలో మిగిలిన ఎమ్మెల్యేలు తిరిగి వైఎస్సార్సీపీకి వస్తారా..అని..జగమొండి అయిన జగన్ వాళ్లని పార్టీలోకి తీసుకుంటాడా...కొడాలి నాని ఆల్రెడీ ఓ ఆల్టిమేటమ్ ఇచ్చేశాడు..."సన్నాసులు..సొల్లుగాళ్లని ఎవడూ పట్టించుకోలేదు..అభివృధ్ది అభివృధ్ది అంటూ తెగ కలవరించి బాబుని కావలించుకున్నారు..అందుకే ఎలక్షన్లలో గల్లంతయ్యారు..ఇక మా పార్టీలోకి వచ్చేదెెవడైనా..రాజీనామా చేసి రావాల్సిందే..ఆ గెలిచినోళ్లలో అంత దమ్మున్నోళ్లు..మగాళ్లు ఉన్నట్లు నాకైతే అన్పించట్లేదు "అని..
నిజంగా నిఖార్సైన మాట అది..పైగా జగనేమో మొదటిరోజే చెప్పాశాడాయె..హోదానే ఎజెండా..అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్దంగా ఉఁడండి అని..గెలిచిన ఎంపీలలో అప్పుడే గుబులు ఓర్నాయనో..మళ్లీ బై ఎలక్షన్లేందిరా సామీ...అని అలాంటప్పుడు ఈ గెలిచిన23 మంది ఎమ్మెల్యేలలో ఎవడైనా పార్టీలోకి వస్తే ఎలా అని
 ఆ డౌటేం అక్కర్లేదు..రిజైన్ చేసి రావాల్సిందే..

వాకే..కానీ జగన్ ఆ పని చేస్తాడా..ఇంకా తన మాస్టర్ ప్లాన్ ఒకటుందంటారు..ఈ గెలిచినవాళ్లలో సూపర్ హీరోలను వదిలేస్తే...మిగిలినవాళ్లు తనని కలుస్తూనే ఉఁటారు..వాళ్లకి కావాల్సిన పనులు వాళ్లకి చేసి పెడతారు..కానీ వైఎస్సార్సీపీలోకి మాత్రం తీసుకోరు..ఎక్కడుంటే ఏంటి..అక్కడే ఉండి పనులు చక్కబెట్టుకోండి అంటాడు జగన్..అవతలి బాబుగారికేమో వళ్లు మండుతుంది..ఠాఠ్..ఇదిలా కుదరదు..కావాలంటే పార్టీలోంచి పోండి అంటాడు..మనోళ్లు పోరు..ఇదెలా ఉంటుంది..ఈ ప్లాన్ అదుర్స్ కదా..సైకలాజికల్..ఇరిటేషనల్ గేమ్

ఇంకా మంటపెట్టాలంటే ఆ 23 మందిలో ఓ హీరోని ఎంచుకుని పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీకి ఛైర్మన్ ని చేయొచ్చు..అదీ కుదరదంటే..ఏదోక స్టాండింగ్ కమిటీలో మెంబర్‌ని చేయొచ్చు..అలా బాబుగారి తిక్క కుదర్చవచ్చు..ఇవన్నీ అప్పుడే జరిగేవి కాదు కానీ..ఇలాంటి వ్యూహాలే జగన్ మైండ్‌లో ఉన్నాయంటున్నారు మరి..పైగా జగన్ మోహన్ రెడ్డి సిఎం కావడం జన్మలో జరగదు..అన్నవాళ్లకి జనం చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పిన తర్వాత అసెంబ్లీలో వాళ్లకి ఎదురుగా కూర్చుని కన్పించాలి కానీ...కలిపేసుకుంటే ఎలా

Comments