రవిప్రకాష్..నిజంగా హీరోనేనబ్బా..


ఓ వైపు ఛానల్ యాజమాన్యం అతన్ని తొలగించామంటోంది..పరారీ అయ్యాడంటోంది..కానీ వాస్తవం..మొన్న రాత్రి 9 పిఎం బులెటిన్ చేసినవాడు రెండ్రోజుల నుంచి పరారీ అవుతాడా. ఆ తర్వాత ఆయనపై ఆరోపణ..యాజమాన్యం మాట వినడం లేదని..తర్వాతది..అసలు కొత్త మేనేజ్ మెంట్ రాకనే అడ్డుకుంటున్నాడని..ఇవి రెండూ ఏమైనా నమ్మేలా
కన్పిస్తున్నాయా...? ఎందుకంటే..కోట్లకి కోట్లు డబ్బులు పెట్టి కొనుక్కున్నవాళ్లని కాదని..ఏ ఉద్యోగైనా ఎంతకాలం
ఉండగలడు..ఇంకోటి తెలుగు ఛానళ్లలో టివి9 అంటే రవిప్రకాష్..రవిప్రకాష్ అంటే టివి9..అతగాడి కంటే పోటుగాడు
టివి9కి దొరుకుతాడా..సరే ఓకే..ఉండొచ్చు..యాజమాన్యానికి అనుకూలమైన వాడినే పెట్టుకోవచ్చు..

ఎందుకంటే రవిప్రకాశరావు కొత్త యాజమాన్యం చెప్పినట్లు విని ఉండకపోవచ్చు..సరే రెండో ఆరోపణ కొత్త మేనేజ్‌మెంట్ రాకని అడ్డుకోవడం..ఇది ఎవరికి ప్రయోజనం..ఓనర్ ఇంకొకడికి అమ్ముకుంటే కొత్త ఓనర్ రాక ఆలస్యం అవ్వొచ్చేమో కానీ..పూర్తిగా అడ్డుకోవడం కుదిరేదేనా

సరే ఇక కొత్త మేనేజ్ మెంట్ రవిప్రకాష్ ని తొలగించింది ..ఇది జరగదు ఎందుకంటే లిస్టెడ్ కంపనీ కాకపోయినా..డీమ్యాట్ పద్దతిలో షేర్ల బదలాయింపు జరుగుతున్న రోజుల్లో...ఆ మాటికి వస్తే అన్ లిస్టెడ్ కంపెనీలలో అయినా ఏ సీఈఓని డిస్మిస్ చేయడం ఉన్నపళంగా కుదరదు..నోటీస్ ఇవ్వాలి..వివరణ కోరాలి..దానికి బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్ ఆమోదం పొందాలి..దీనిపైనా రవిప్రకాశరావు కోర్టులకు వెళ్లొచ్చు..కానీ ఇంతపట్టుదలగా ఎందుకు వేలాడాలి పదవి పట్టుకుని..ఐతే ఉద్యోగికి హక్కులు ఉంటాయ్..ఎప్పుడుబడితే అప్పుడు ఏవో ఆరోపణలు చేసి పంపిస్తామంటే కుదరదు..దుర్మార్గుడైన ఉద్యోగికి ఒక రూల్..మంచి ఉద్యోగికి ఒక రూల్ అనేం ఉండదు..ఎవరికైనా ఒకటే కనీసం 3 నెలల నోటీస్ పీరియడ్ ఉంటుంది. అలా అయినా టివి9లో రవిప్రకాశరావ్ కి ఎనిమిదో తొమ్మిదో శాతం వాటాలు ఉన్నాయంటున్నారు..అంటే ప్రమోటర్ల తర్వాత ప్రధాన వాటా రవిప్రకాశ్ దే..అలాంటప్పుడు టివి9 నుంచి రవిప్రకాశ్ ని పంపేయడం ఎవరి తరం కాదు..
ఇక హీరో అని ఎందుకు అంటున్నామంటే..యాజమాన్యం ఎలాంటి కేసులు పెడతామని బెదిరించినా..లెక్కచేయకుండా..హ్యాపీగా..ఛానల్ కి వచ్చి..తాను చెప్పదలిచింది చెప్పాడు..చురకలు వేసాడు
ఐతే ఒకటి కత్తితో తిరిగేవాడు కత్తితోనే చస్తాడు..బైబిల్ లో ఉందట..ఇది రవిప్రకాశ్ కి బాగా అర్ధమైఉండాలి..ఎందుకంటే..ఇన్నాళ్లూ టివి9 చేసిన దుర్మార్గపు బ్రేకింగులకు ఇప్పుడు పరాకాష్టగా అతనే టార్గెట్ కావడం 

Comments

  1. thokkem le.. tcs laanti pedda institution nunche mishri ni okesari terminate cheysi pampinaru and it is a listed company.. Mishri is having more stake in tcs.. Ravi Prakash is facing serious allegations now.. He has to resign and face the consequences, and prove. Untill then he is a fraud guy..

    ReplyDelete
  2. మీ అవగాహనకి జోహోర్లు

    ReplyDelete
  3. నడిమిట్ల గరుడ శివాజీ బక్రా!

    ReplyDelete
  4. There are 4408 companies listed in the same address of Alanda Media.
    How is that possible ? those many suitcase companies ?
    And why didn't RoC or CBI didn't get any alert ? or did they sleep ?

    https://www.zaubacorp.com/company/ALANDA-MEDIA-ENTERTAINMENTS-PRIVATE-LIMITED/U74994TG2018PTC124866


    https://www.zaubacorp.com/company-by-address/H-NO-1-123-MY-HOME-HUB-8TH-FLOOR-3RD-BLOCK-HI-TECH-CITY-MADHAPUR-HYDERABAD-TG-500081-IN-

    ReplyDelete

Post a Comment