చంద్రబాబు మెజారిటీ ఎందుకు తగ్గుతోంది..జగన్ ఆధిక్యత ఎందుకు పెరుగుతోంది


పార్టీ అధినేతలనే కంగారు పెట్టిన ఎన్నికలు ఇవి..2019 ఎన్నికలు పాపం రాహుల్ గాంధీకి..కవితకి, నారా లోకేష్‌కి, ఇంకా భవిష్యత్ తరం నేతలకు చాలామందికి గుర్తుండిపోతాయ్. ఓటమి ఎరుగరు అనుకుంటూ భ్రమల్లో ఊరేగిన వీరిలో లోకేష్‌కి తొలి ఫలితమే ఇలా దెబ్బకొట్టింది..తర్వాత ఎన్నికలలో విజయం సాధించవచ్చు కానీ..తొలి ఓటమిని గుర్తుంచుకుంటేనే రాజకీయాల్లో కొనసాగినంతకాలం అప్రమత్తంగా ఉంటారు..ఆ మాటకి వస్తే ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు కూడా తొలిరోజుల్లో ఓటమి పాలయ్యారు. తర్వాత తిరిగి ఓడిపోలేదు..ఈ 2019లో ఆయన తొలి రెండు రౌండ్లలో వెనుకబడిపోయారనే బ్రేకింగ్ చూశాం..( పోస్టల్ ఓట్లో...మరేదో తెలీదు కానీ...తొలి రెండు రౌండ్లు మాత్రం అదే జరిగింది) ఐతే ఆయన కుప్పంలో గెలుస్తున్న సమయంలో మెజారిట ీ తగ్గిపోవడం మాత్రం టిడిపికి ఆందోళన కలిగించే అంశమే...
చంద్రబాబునాయుడుగారు కుప్పంలో 2004లో గెలిచిన సమయంలో ఆయన మెజారిటీ 59,588ఓట్లు..అదే 2009లో ఇది 46,066ఓట్లకి తగ్గింది..తిరిగి 2014లో మాత్రం 47,121 ఓట్లకి పెరిగిందాయన ఆధిక్యత..ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిన ఈ ఎన్నికలలో కుప్పంలో ఆయన మెజారిటీ 31,943 ఓట్లుగా కొన్ని చోట్ల..30వేల ఓట్ల చిల్లరగా కొన్ని చోట్ల ప్రచురితమైంది..ఎలక్షన్ కమిషన్ ఆప్ ఇండియా మాత్రమే ఖచ్చితంగా 30,722ఓట్లుగా చూపిస్తోంది.అంటే గత ఎన్నికల కంటే..ఈసారి ఆయన మెజారిటీ దాదాపు 17వేలు తగ్గింది..దశాబ్దాలపాటు ఒకే చోట గెలుస్తున్న నేతగా సహజంగానే ఇక్కడి ఓటర్లలో నిర్లిప్తత వలన వచ్చిన నిరాసక్తతగా దీన్ని చూడాలా..2004లో రాజశేఖర్ రెడ్డి సిఎం అయిన తర్వాత చంద్రబాబుగారి బంధువు ఒకాయన వైఎస్సార్ ని చూసి నేర్చుకో అంటూ సలహా ఇచ్చాడని అప్పట్లో ప్రచారం జరిగింది. చిత్తూరు జిల్లాలో టిడిపి ఆధిక్యత ఎప్పుడూ ప్రదర్శించింది లేదు..లేకపోతే..నామినేషన్ కి కూడా రాకుండా వాళ్లే ఓటేస్తారులే అనే నిర్లక్ష్యం కూడా బాబు మెజారిటీ తగ్గడానికి కారణమైందా అనేది టిడిపి క్యాడర్ చర్చించుకోవాలి..లేదంటే ఇదే ట్రెండ్ కొనసాగితే..అమేథీలో రాహుల్ గాంధీకి ఎదురైన పరాభవం బాబుగారికి ఎదురు చూస్తుంటుంది.

ఇదే వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే...2014లో పులివెందులలో ఆయన ఆధిక్యత 75,243 ఓట్లు..2019 ఎన్నికలలో ఈ మెజారిటీ 90,110ఓట్లకి పెరిగింది..పైగా  ఇక్కడ ప్రత్యర్ధికి ఆయనకీ వచ్చిన ఓట్లశాతంలో తేడా 50శాతానికిపై మాటే..2014కి ముందు పులివెందులో వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మిగారికి 81వేల పైనే మెజారిటీ వచ్చింది. ఇక్కడ వైఎస్ జగన్ మెజారిటీ పెరగడానికి కారణాలు వెతకక్కర్లేదు..వైఎస్ కుటుంబసభ్యులు ఎవరో ఒకరు ఇక్కడ జనాలకు అందుబాటులో ఉంటూ వచ్చారు. వైఎస్ వివేకా, వైఎస్ అవినాష్ తర్వాత షర్మిల, వైఎస్ సుధీకర్ రెడ్డి..ఇలా బంధుగణం ఎక్కువగా ఉన్నందునే ఇక్కడ జగన్ ప్ర్తత్యేకంగా తిరగాల్సిన అవసరం రాదంటారు..అయినా సరే ఈ జిల్లా అంతటా పర్యటించడంలో వైఎస్ ఫ్యామిలీ ఎప్పుడూ నిర్లక్ష్యం చేయదు..అందుకే ఈసారి ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది..కానీ చంద్రబాబుగారి విషయానికి వస్తే..కుప్పం, చంద్రగిరి, నారావారి పల్లె ఇవి సంక్రాంతి పండగ సంబరాలు చేసుకోవడానికి తప్ప..ఇతర సమయాల్లో అటువైపు తొంగిచూసినట్లు కన్పించదు..( ఓవేళ చూస్తే...మీడియాలో అందులో మన బ్యాచ్ మీడియా ఊరుకుంటుందా...అర్ధగంటలు ప్రసారాలు చేయదా) అందుకే  ఓటర్లలో ఓ రకమైన నిర్లిప్తత కన్పిస్తుందనుకోవచ్చు..

Comments