తెగులు ఇండస్ట్రీలో ఫృథ్వి ప్రశ్నకి జవాబు చెప్పకపోతే..వేట అటుకూడా!



"సినిమాలు వేరు రాజకీయం వేరు..కళకి ఏ పార్టీతో సంబంధం లేదు..మేం ప్రజలను రంజింపజేయడానికే ఉన్నాం..మాలో కొందరు ఏ పార్టీలో ఉన్నా..అది అంత వరకే కళాకారులుగా మేం అందరివాళ్లం"

ఈ మాటలు ఇప్పటికి కనీసం డజనుసార్లు విని ఉంటాం..కానీ సినిమారంగంలోని వారే రాజకీయనాయకుల కంటే ఎక్కువగా రంగులు మార్చడం ఈసారి చూసాం..తమ కులాన్ని అడ్డంపెట్టుకుని పదవులు సంపాదించడం..అలా సంపాదించిన పదవులు కాపాడుకోవడానికి..దోచుకున్నది తిరిగి కక్కకుండా ఉండేందుకు తమకి అనుకూలమైన తమవారే గెలవాలనకుంటూ పత్రికాప్రకటనలు ఇచ్చిన సందర్భాలు ఈ 2019 ఎన్నికలకు ముందు బ్రహ్మాండంగా చూశాం...ఐనా...సరే..ఎవరు గెలిచినా వారికి అభినందనలు తెలుపుతూ చిత్రపరిశ్రమ పెద్దలు కొన్ని కార్యక్రమాలు చేస్తుండటం పరిపాటి..కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు..

అటు కేసీఆర్ గెలిచినప్పుడు కానీ..ఇక్కడ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఈ అలవాటుని వదిలిపెట్టారు. కేసీఆర్‌కి అంటే ప్రత్యేకంగా ఓ ఛాంబరే ఉంది ( తెలంగాణ ఫిలం చాంబర్) ఇది ఎటూ ఆయన్ని సన్మానించింది..సంబరాల్లో ముంచెత్తింది..తెలంగాణ వరకూ కేసీఆరే సిఎం..తెలంగాణనే కేసీఆర్ అనే స్థితి ఉంది కాబట్టి..ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు..కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏదో జరగరాని అన్యాయం జరిగినట్లు ఎవడికి వాడే అన్నీ మూసుకుని ఓమూల కూర్చున్నారు కానీ.. ప్రభుత్వాన్ని అభినందించాలనే ఆలోచనే ఉన్నట్లు లేదు..బహుశా..దాసరి లేని లోటు ఇక్కడ స్పష్టంగా కన్పిస్తున్నట్లు ఉంది. ఎందుకంటే..ఆయన ఏ పార్టీ అయినా..ప్రభుత్వాలకు తమకి రావాల్సిన ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల గురించి( అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి పార్టీ వీళ్లని బా..గా..ప్రోత్సహించింది) విజ్ఞాపనలు..విజ్ఞప్తి పత్రాలు ఇచ్చేవాడు..కానీ ఇప్పుడు ఎవరూ లేరు..

దీనికి కారణం ఏంటి...అటు బాలయ్య పార్టీ ఓడిపోయింది..ఇటు పవన్ కల్యాణ్ సోది లేకుండా పోయాడు..మరి మిగిలి ఉన్నవాళ్లలో పెద్దలంటే..కృష్ణంరాజు, కృష్ణ, వీళ్లకి వయసు మీద పడి పాపం కనీసం బైట కాలు పెట్టాలన్నా ఎవరో ఒకరి సాయం కావాల్సి వస్తుంది..వారసులనే పదం నటన అభిమానం వరకే కానీ..ఇలాంటి విషయాల్లో ఎవరూ ముందుకు రారు..మిగిలి ఉన్నది..చిరంజీవి..నాగార్జున, వెంకటేష్..సురేష్..మోహన్ బాబు, వీళ్లకైనా ఆ ఆలోచన ఎందుకు రాలేదో..
ఇలాంటి ప్రశ్నలు అడిగిన ఫృథ్వీరాజ్ నిజంగా హీరోనే..ఎందుకంటే..పార్టీలు ఐదేళ్లకోసారి పోతాయ్..వస్తాయ్..కానీ వాస్తవాలను ఇలా అడగగల నటులు (అందులో ఈయనేం ఇండస్ట్రీలో డామినేటింగ్ క్యారెక్టర్ కూడా కాదు) తక్కువ..పైగా సూడో మేధావుల ముసుగులో వైవిఎస్ చౌదరిలాంటోళ్లు పెట్టే తిప్పలు అన్నీ ఇన్నీ కాదు..ఓ పే...ద్ద లెటర్ ఈయనగారు రిలీజ్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది..కులాలను పక్కనబెట్టి..ఈయన పార్టీ కి ఓటేయాలని తెగ బాధపడి పోయాడు..మరిప్పుడు జనం ఓట్లతో ఇచ్చిన తీర్పుపై కూడా ఓపెన్ లెటర్ రాస్తే బావుంటుంది కదా...

ఆ..ఏంటీ...ఓహో...నాకే సినిమాలు లేవ్..నేనేం పిలుపు ఇస్తా అనా...మరదే..మీ బాబు గెలిస్తే ఈపాటికి నువ్వూ..నీ బ్యాచ్ ఏం చేసేదే మాకు తెలీదా అంటూ ఇప్పటికే సైటెర్లు పేల్చుతున్నారు జనం ఇది వినబడలేదా....ఒక్క పూరీ జగన్నాధ్ మాత్రమే జగన్ పై ప్రశంసలు..అవీ ఇవీ అంటూ ఏదో రాసుకొచ్చాడు కానీ..కలిసింది లేదు..ఆలీ, పృథ్వీరాజ్, శ్యామల..రాజశేఖర్, జీవిత వీళ్లెటూ పార్టీకి పని చేశారు కాబట్టి..ఎటూ ఆ కార్యక్రమం ఏదో చేసే ఆలోచన ఉందో లేదో బైటపెట్టలేదు..ఎందుకంటే అది కూడా పార్టీ కార్యక్రమం కింద రంగు పూస్తారు కాబట్టి..కానీ మీకు సబ్సిడీలు..గట్రా కావాలి కానీ..కనీసం గవర్నమెంట్ దగ్గరకు వెళ్లే దమ్ము మాత్రం లేదన్నమాట..మీ శాతకర్ణులకు..మహానాయకుడులకు...సబ్సిడీ కావాలి..కానీ ముఖ్యమంత్రి మాత్రం మీవాడైతేనే కలుస్తారన్నమాట..నిజం ఒప్పుకోలేని గజ్జిగాళ్లకి అందుకే జనం సరైన బుద్ది చెప్పారు..

మరి జగన్ దగ్గరకు ఎప్పుడు వెళ్తున్నారు మా సభ్యులు..చూద్దాం..చూడబోతే..ఒక్క నాగేంద్రబాబు మాత్రమే కదిలేట్టు ఉఁది

Comments