సచిన్ టెండూల్కర్ కే టోకరానా


సచిన్ టెండూల్కర్ క్రికెట్‌లో ఓ లెజెండ్..అసలు భారత క్రికెట్‌కే సచిన్ ఓ  బ్రాండ్  అని అతను క్రికెట్ ఆడుతోన్న సమయంలో చెప్పుకునేవారంటే అతిశయోక్తి కాదు..మరలాంటి బ్రాండ్‌ని ఫ్రీగా వాడుకుంటామంటే కోపం రాదా..అదే జరిగిందిప్పుడు..నిబంధనలను అతిక్రమించి తన పేరు వాడుకుంటున్నారంటూ సచిన్ ఓ ఆస్ట్రేలియా కంపెనీపై కోర్టుకెక్కాడు..
తనతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు రెమ్యునరేషన్ ఇవ్వకుండా సచిన్ ఇమేజ్ సదరు కంపెనీ వాడుకుంటుండటమే ఇందుకు కారణం..ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్పార్టాన్ స్పోర్ట్స్ అనే కంపెనీ 2016లో టెండూల్కర్‌తో ఓ డీల్ కుదుర్చుకుంది. తాము తయారు చేసే బ్యాట్లపై సచిన్ పేరు..లోగో వాడుకుంటామని ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం వన్ మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్స్ ఇచ్చేలా డీల్ సెట్ చేసుకుంది. ఆ తర్వాత కూడా స్పార్టాన్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ కోసం ఒప్పందం పరిధి పెంచుకుంది.. లండన్‌, ముంబైలలో ‘సచిన్‌ బై స్పార్టాన్‌’ కాన్సెప్ట్‌తో అనేక ఈవెంట్లను కండక్ట్ చేసింది.
సీన్ ఇక్కడ కట్ చేస్తే..2018 వచ్చినా కూడా సచిన్‌కి స్పార్టాన్ ఏ పేమెంటూ చేయలేదట..సచిన్ టీమ్ స్పార్టాన్‌ కంపెనీవర్గాలను సంప్రదించినా..ప్రయోజనం లేకపోగా..డీల్ రద్దు చేసుకున్నట్లు సచిన్ టెండూల్కర్ సదరు సంస్థకి సమాచారం ఇచ్చారట. ఐతే డీల్ రద్దైనట్లు చెప్పినా ..స్పార్టాన్ సచిన్ ఇమేజ్ వాడుకుంటూనే ఉంది..అందుకే ఇప్పుడు రావాల్సిన పేమెంట్‌తో పాటు మరో మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల పరిహారం కలిపి 2 మిలియన్ డాలర్ల నగదు చెల్లించాలని కోర్టుకెక్కాడు సచిన్. తన పేరు లోగో ఇన్నాళ్లూ వాడుకున్నందుకు రాయల్టీ కింద తనకు 2 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని సివిల్ సూ దాఖలు చేశాడు

Comments