దివ్యవాణి చెప్పినదా...మరి కోడెల ఫీలింగేంటి


దివ్యవాణికి పార్టీ కార్యక్రమాలు కొత్త..రాజకీయాలు అసలే కొత్త..అసలు నిజాలు కళ్లముందు కన్పిస్తున్నా..కారణాలు వెతుకుతున్నట్లు కన్పించాలే కానీ..నిజాలు బైటికి చెప్పకూడదు..పార్టీ ముఖ్యులకు...ముఖ్యంగా అధినేతకు కోపం తెప్పించే కారణాలు అసలే చెప్పకూడదు..పాపం ఇప్పటిదాకా పార్టీ కార్యాలయంలో అవతలివారిపై నిందలు..డైలాగులు వేసినట్లుగానే..పార్టీ మీటింగ్స్ లో కూడా వ్యవహరించవచ్చని అనుకుందేమో కానీ...అసలు నిజాల్లో ఓ నిజం కక్కేసింది..

కోడెల అవినీతిపై జనం ఆమెకి ముందే చెప్పారట..అసలు ఈమె ఎక్కడ పర్యటించింది..ఎన్ని గ్రామాలకు తిరిగింది..సరే తిరిగిందనుకుందాం..ఏ లీడర్ లేడని..ఈమె దగ్గరకే వచ్చి మొరపెట్టుకున్నారా...ఏ పార్టీలో అయినా పెయిడ్ ఆర్టిస్టుల్లానే సినిమావాళ్లని చూశారు కానీ..నిజంగా లీడర్ కి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తారా..బహుశా ఆమె విషయంలోనూ అదే జరిగి ఉంటుందని ఇప్పటి ఆమె మాటలను బట్టి అనుకోవాలా...

మనకి గిట్టని వారిని తిడుతుంటేవారి ఫీలింగ్స్ ని క్లోజప్ లో చూపించే మన బ్యాచ్ మీడియా..మరి ఇప్పుడు కోడెల గురించి దివ్యవాణి ప్రస్తావిస్తుంటే ఆ పని ఎందుకు చేయలేకపోయింది..ఉరిమి ఉరిమి ఏదో పడ్డట్టు..అటూ ఇటూ చేసి ఈవిఎంలు..అధికారులు..టెలికాన్ఫెరెన్స్‌లు..ఉద్యోగులమీద పడితే..నష్టం ఎవరికి..తిరిగి ఇదే ఫలితం రిపీట్ కాదా..

మనకి అన్నీ క్షణాల్లో తెలిసిపోతాయని చెప్పుకునే ప్రపంచస్థాయి నేతకి ఇవన్నీ తెలీవా...తెలీకుండానే..ముద్దపప్పు..కే ట్యాక్స్..నేతలు రెచ్చిపోయారా..ఎంత దోచుకున్నా..చివర్లో పసుపు కుంకుం..రైతు చెక్కులే భరోసా ఇస్తాయనే ధైర్యంతోనే కదా..ఎన్నికలలో గెలుపు మాదే అనుకుంది..వాటిని కప్పి పుచ్చుకునేందుకు సమీక్షలు చేసుకుంటే...నిజాలు బైటికి ఎందుకు చెప్తారు..అంతా గప్ చిప్..

Comments