కేసుల భయమా..లేక పొలిటికల్ ఫ్యూచరా..సుజనా చౌదరి డైలమా


" మిమ్మల్ని టిడిపి లీడర్‌గా ఎన్నాళ్ల వరకూ  చూడొచ్చు?" 
" నేనున్నంతవరకూ  " 

" అంటే సుజనా చౌదరి బతికి ఉన్నంతవరకూ టిడిపిలోనే ఉంటారు..పార్టీ మారరన్నమాట  " 

" లేదు..ఇప్పుడు నేను చెప్తుంది..నేను టిడిపిలో ఉన్నంతవరకూ టిడిపి లీడర్‌గా చూడమని"
ఇంతకంటే డైరక్ట్‌గా నేను పార్టీ మారుతున్నా అనో...ఎప్పుడు మారేదీ చెప్తా అనో చెప్పవచ్చు కదా...సుజనా అనబడు..యలమంచిలి  సత్యనారాయణ గారు తాజాగా పిలిచి మరీ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లిబుచ్చిన మనోగతం..

రాజకీయాలు అంతే..సక్సెస్ కే ప్రాధాన్యం ఇచ్చే లీడర్లైతే..చాలా చక్కగా నేరుగా ఎలాంటి జంకు గొంకూ బొంకూ లేకుండా పోయి కండువాలు మార్చేస్తుంటారు..సుజనా కూడా అంతే అనుకోవాలి..ఎందుకంటే..ఆయన మంత్రివర్గంలో ఉండగానే..హోదా కోసం జల్లికట్టు కాకపోతే..పందులాట ఆడుకోండి అన్నాడు..అదే నోటితో ప్రత్యేక హోదా మా హక్కు అంటూ ఢిల్లీలో కాగడాల ర్యాలీ చేశాడు..తర్వాత మోడీ సర్కారుపై నానామాటలూ అన్నాడు

ఇప్పుడు అదే నోటితో మోడీకి ఉన్న విజన్ సూపర్ అంటాడు..ఇంతకీ సూపర్ విజన్..ఎవరిదీ క ాదు..సుజనాదే అనుకోవాలి..పైగా ఆయనపై కేసులు..విచారణ చూస్తూ కూడా బిజెపి తీసుకుంటుందా అని..ఐనా తీసేసుకుంటుంది..పెద్ద పట్టించుకునే బాపతు కాదనుకోవాల్సిందే

కేసులకి భయపడి మారుతున్నారనుకోవాలా...లేక తన పనులు కోసం వెళ్తున్నాడనుకోవాలా అనే సందేహం ఇక్కడ తలెత్తకుండా ఉండదు..పైగా తనకి దేవుడు అన్నీ ఇచ్చాడంటారు...ఆయనే చెప్తాడు..మరి అన్నీ ఇచ్చినప్పుడు ముందున్న పార్టీ ని వదిలిపెట్టాల్సిన అవసరం ఏముంది..నో ఆన్సర్ 

Comments