టిఆర్ఎస్ భజన బృందంలో నాగ్, రవితేజ..ఆటాడుకున్న వైనం


కాళేశ్వరం ఓపెనింగ్ సందర్భంగా ఉన్న ఛానళ్లన్నీ అది తప్ప వేరే న్యూస్ లేనట్లు చూపించడం ఓకే..ఎందుకంటే నిజంగానే పెద్ద ప్రాజెక్టు గత ముఫ్పైఏళ్లలో లేని సందర్భం కావడంతో ఆ రేంజ్‌లో చూపించడంలో తప్పులేదు..ఐతే జరిగింది ఆ కోణంలో కాకుండా..కేవలం బాసుని సంతృప్తి పరిచే ఉద్దేశంతోనే కావడంతోనే జనాలకు చిరాకు పుట్టిందనడంలో సందేహం లేదు

ఐతే ఈ సందర్భంగా నాగార్జున, రవితేజని ఎవరో పిలిచి మరీ ట్విట్ ఇప్పించినట్లు..బాకా ఊదేశారు..కానీ ఆ క్రమంలో ఉచితం అనుచితం అనే పదాలకు అర్ధం మరిచిపోయి..ప్రభుత్వంతో పాటుగా ప్రత్యేకంగా కేటీఆర్‌ని అభినందించారు..కేటీఆర్‌కి కాళేశ్వరానికి సంబంధం ఏంటి ఉంటే గింటే సమ్ బంధం అప్పటి ఇరిగేషన్ మంత్రికి ఉండాలి..అంటే హరీష్‌రావ్‌కి ఉండాలి..కానీ అది మరిచి తమ బాకా ప్రభువులకు ఊదడం
ద్వారా ఏం చెప్పదలిచారో మరి ఈ నటులు..ఎటూ నటులు కాబట్టి..నటించడంలో ఆరితేరిపోయారనుకోవాలేమో..

ఐతే జనం ఊరుకోరు కదా..జస్ట్ చేతిలో చిన్న డివైజ్‌తో డిజ్‌లైక్ కొట్టడంతోనే ఆగిపోరు..వాళ్లు చేసిన తప్పులను ఊరంతా తిరిగేదాకా షేర్ చేశారు డ్రగ్స్ కేసులో చిట్ కోసమేనా ఈ తిప్పలన్న కోణంలోనూ రవితేజకి ఝలక్ ఇచ్చారు..అంతే కదా..మరి..అంతే అంతే

Comments