నువ్వే కావాలి ...ఆ నవ్వే కావాలి రాహుల్ బాబా

నాకు వద్దీ పదవి అంటున్నా కూడా..రాహుల్ గాంధీ వెంటనే పడుతున్నారు కాంగ్రెస్ నేతలు..పార్టీ ఓటమికి బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలని  రాహుల్ అంటుంటే..ఆ పని మీది కాదని..మాదంటూ పొర్లుదండాలు పెడుతున్నారు. దీంతో రాహుల్ అస్త్రసన్యాసం ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలీని పరిస్థితి నెలకొంది
రాహుల్ గాంధీ రాజీనామా చేసి దాదాపు నెలరోజులు అవుతోంది. ఐతే ఆ పదవి చేపట్టేందుకు నిరాకరిస్తుండటంతో
పార్టీకి చీఫ్ ఎవరో తెలీని పరిస్థితి..మధ్యలో అశోక్ గెహ్లాత్ పేరు విన్పించినా..అదేం ఖరారు కాలేదు. తాజాగా ఏఐసిసి లీగల్ సెల్ ఛైర్ పర్సన్ వివేక్ టంకాతో సహా పలువురు నేతలు రాజీనామాల బాట పట్టారు.
రెండురోజల క్రితమే సోనియాగాంధీ నేతృత్వంలో  పార్టీ అధ్యక్షుడి ఎంపిక, పలు రాజకీయ అంశాలపై చర్చించేందుకు  పార్లమెంటరీ స్థాయి నేతలతో సమావేశం ఏర్పాటైంది..ఇందులో కూడా నేతలందరిదీ ఒకటే మాట రాహుల్ బాబే తిరిగి అధ్యక్షుడిగా ఉండాలంటూ కోరారు..ఐతే ఆయన మాత్రం తన రాజీనామాలోని సీరియస్‌నెస్ తెలుసుకోపోతే ఎలా అంటూ మండిపడ్డారట
ఐతే పట్టువదలకుండా పార్టీ సీనియర్ నేతలు పీసీ చాకో, షీలా దీక్షిత్‌, కేసీ వేణుగోపాల్‌, అజయ్‌ మాకెన్‌  శుక్రవారం రాహుల్‌ నివాసానికి వెళ్లారు. రాజీనామా వెనక్కి తీసుకోమని కోరారు. ఐనా ఫలితం లేకపోయిందంటున్నారు..ఐతే ఈ వ్యవహారమంతా కాంగ్రెస్ పార్టీ క్యాడర్‌లో ఆందోళన మిగుల్చుతోంది..ఓవైపు ప్రత్యర్ధి పార్టీల నేతలు విమర్శలు గుప్పించుతుంటే..తాము మాత్రం లీడర్ ఎవరో తెలీక జుట్టు పీక్కోవడం ఏంటని గుసగుసలాడుతున్నారు.

Comments