బాబుకి దండం పెట్టుకోవాలట.. దేవుడి స్క్రిప్ట్‌లో కామాలు..ఆ తర్వాత ఏం ఉందో ఎలా చెప్పగలరు లోకేష్



వరస ట్వీట్లతో ఇరగదీస్తోన్న మందలగిరి మాజీ మంత్రి గారు..దేవుడి స్క్రిప్ట్‌లో కామాలు..ఉంటాయని..ఫుల్ స్టాప్ మాత్రమే ఉండదంటూ తాజాగా ట్వీటారు..ఇక్కడ జనానికి అర్ధం కానిదొకటే..ట్వీట్లలో కేక పుట్టించే మహానుభావుడు కెమెరా ముందు ఎందుకు తడబడతాడు..అది కూడా మామూలుగా కాదు..బీభత్సంగా..దేవుడి స్క్రిప్ట్ పై కోపంతో
స్క్రిప్ట్ కి భాష్యం తనకి అనుకూలంగా చెప్పుకోవడంలో తప్పు లేదు కానీ...జరిగే ప్రతి ఘటనా..తనకి అనుకూలంగా ఊహించుకుంటే..పాపం గతానుభావాలే పునరావృతం అవుతాయనడంలో సందేహం లేదు

వేరేపనేదీ లేదన్నట్లుగా ట్వీట్లతోనే పోరాటం చేస్తోన్న లోకేషు బాబుగారు..పాత వీడియోలు..ఆడియోలు తీసి జనం మొహాన కొడితే ఆ మాత్రం ఎవరికీ తెలీకుండా పోదా..కోటంరెడ్డిపై పేల్చిన ఆడియో ట్వీట్ ఎన్నికలకు ముందుదని తెలిసినా ఒప్పుకోకపోతే ఎలా..పైగా అదే ట్వీట్‌ని మన ఛానల్లలో కనీసం ఏ మాత్రం మార్చుకుండా ప్లే చేయించడంలోనే అది ప్లాన్డ్ ఆడియోఅని తేలిపోయింది..

సెక్యూరిటీ తగ్గించడంపై విమర్శలెందుకు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ఇస్తుంది.పైగా ప్రతిపక్షనేతకి ఎంత అవసరమో అంతే ఇ స్తారు..సరే మీకు అన్యాయం జరిగిందని వాపోతూ జనాన్ని పోగేసుకున్న ఫోటోల్లో ఉన్నది రైతులని చెప్తే..నమ్మేవాళ్లెవరూ లేరు..వాళ్లంతా మన కార్యకర్తలే కదా..కావాలంటే ఉమాయాదవ్ పరామర్శ ఫోటో చూడు.

.పైన మీరు పోస్ట్ చేసుకున్న ఫోటో చూడు..కనబడటం లేదూ..అంతా మనోళ్లే కదా..దానికి జనమేదో బాబుగారికి అండగా నిలబడతాం అంటున్నారని పొంగిపోతే పోవచ్చ ుకానీ...జనం నమ్మరు కదా..ఇక్కడ ఒకటే ప్రశ్న..ఎందుకు కరకట్టపై అక్రమం అని కూడా ఇళ్లు కట్టుకున్నారు..శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారనా...ఎవరూ పట్టించుకోరనా...ఇదే పని జగన్ మోహన్ రెడ్డి చేసి ఉంటే మీ వైఖరి ఎలా ఉండేది
అందుకే దేవుడి స్క్రిప్ట్‌లో కామాలు...లేవని ఎవరు అంటారు..అందుకే ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది..చివరికి ఇల్లులేని బాబు అంటూ మీరు రోడ్లపై ధర్నాలకు దిగే రోజు కూడా వస్తుంది

పైగా సిఎం కుర్చీలో కూరున్నందుకు బాబుగారికి దండం పెట్టుకోవాలట..ఇంకా నయం ప్రతి రోజూ ఫోటోకి దండ వేసి
పూజ చేయాలనలేదు..ఇలాంటి సెకలు పడతారు కాబట్టే..పాత కుర్చీలు తీసి కొత్త కుర్చీలు వేసుకుందామనుకునేది..అందుకే కానీ..ప్రజావేదిక కూలిందా ఏంటి..

Comments