అదిరిందయ్యా చంద్రం..మళ్లీ అదే మాట


స్థానిక సంస్థల ఎన్నికలలో బ్యాలెట్ పేపరే వాడతారు..అక్కడే ఎవరి బలం ఏంటో తెలుతుంది..మనం ఎక్కడా తప్పు చేయలేదు ధైర్యంగా ముందుకు వెళ్తాం..
ఇవీ చంద్రబాబుగారి లేటెస్ట్ మాటలు..ఈ వ్యాఖ్యలు చాలు..చంద్రబాబుగారు ఇంకా ఎంత భ్రమలో ఊరేగుతున్నారో తెలియడానికి బ్యాలెట్ పేపర్ వాడితే అందులో గెలిస్తే..అదంతా టిడిపి సత్తా అనుకోవాలట..

సప్పోజ్..పర్ సప్పోజ్..ఓ వేల అక్కడా ఓడితే..ఇక పార్టీ మూసేస్తారా..ఈ ప్రశ్న చంద్రబాబునాయుడుగారిని అడిగే ధైర్యం ఎవరైనా చేయగలరా

ఐతే ఓడిపోయినంత మాత్రాన డీలాపడిపోయి..మొహం చాటేయడం కంటే ఇదే బెటర్ అని చంద్రబాబుగారు అనుకుంటే అనుకోవచ్చు కానీ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం ఇది మాత్రం కాదు.ఎందుకంటే..ఎంత దారుణంగా ఓడిపోయినా..లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అంతకుముందు జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన పార్టీ మంచి సీట్లే దక్కించుకుంటూ వస్తుంది..అందులో ఏ పార్టీ మినహాయింపు కాదు..అంచేత..దాన్నే
అడ్డం పెట్టుకుని అక్కడికేదో అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని ఈవిఎంలకు అంటగట్టే ప్రయత్నం చేస్తే..అంతకంటే కామెడీ ఇంకోటి ఉండదు

వైఎస్సార్సీపీకి ఓటేసినవాళ్ల బంధువులే టిడిపి తరపున లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నిలబడతారు..లేదంటే టిడిపి వాళ్లో కాంగ్రెస్ వాళ్లో ఇతర పార్టీల తరపున బరిలో దిగుతారు..ఓ  రకంగా పార్టీ గుర్తులపై పోటీ చేసినా చేయకపోయినా పార్టీ బలపరిచిన అభ్యర్ధులుగా చెప్తారే తప్ప..స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు ఓటములను అసెంబ్లీ జయాపజయాలకు ముడిపెట్టడం అజ్ఞానం...ఐతే ఎంతైనా గెలుపు గెలుపే..లోకల్ బాడీ ఎలక్షన్స్, మునిసిపల్ కార్పోరేషన్ ఎలక్షన్స్‌లో గెలిస్తే..టిడిపి కాస్తైన బైటతిరిగే వెసులుబాటు తొందరగా చిక్కుతుంది..లేదంటే హేళన ఎదుర్కొంటూ టివి చర్చలలో జుట్టు పీక్కోవాల్సి వస్తుంది

Comments

  1. నలుగురు అధికారులు మూడేళ్ళలో 18 లక్షల రూపాయిల డ్రైఫ్రూట్స్ తినేసారు. ఖర్జూర నాయుడి కొడుకు పాలనా మజాకా!

    https://telugu.news18.com/news/politics/cost-of-four-officers-dry-fruits-is-rs-18-lakhs-cm-ys-jagan-shock-in-review-meeting-sb-218984.html

    ReplyDelete

Post a Comment