కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ..మరో వివేక్ అవుతాడా


బిజెపిలో చేరతా..అని చెప్పి 20 రోజులు దాటుతున్నా కూడా ఇంకా ముహూర్తం ఫిక్స్ చేసుకుని రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ని చచ్చిన పాముని చంపినట్లు కొట్టడం ఏంటో  అతనికే తెలియాలి..బహుశా పిిసిసి చీఫ్ పదవి అప్పజెప్తే ఆగిపోతాననే సంకేతాలో ఏంటో కానీ..ఇతగాడి ధోరణి చూస్తే జాలేయకతప్పదు. అమాయకంగా
పార్టీని వదిలేసి వేరే పార్టీలోకి వెళ్లి ముఖ్యమంత్రిని అవుతా అని చెప్తుంటే..చుట్టూ ఉన్నవాళ్లు ఒక్కరూ అతనికి తప్పు ఒప్పులు చెప్పడం లేదు..పైగా క్యాడర్ రివర్స్ అయిన సంగతి కూడా చూశాం

రాజగోపాలరెడ్డి తీరు చూస్తుంటే..ఖచ్చితంగా ఓ వ్యక్తి గుర్తుకు వస్తాడు..కేసీఆర్ 2004కి ముందరో..ఆ తర్వాతో ఓ ప్రకటన చేశాడు..తెలంగాణ వస్తే తొలిగా ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి మాదిగనే..అని..అది ఎవరూ నమ్మలేదు..ఈ డైలాగ్ కాస్త కఠినంగా అన్పించిందా..సరే..తక్కువ మంది నమ్మారు..కానీ ఓ వ్యక్తి మాత్రం అమాయకంగా నమ్మాడు..పైగా ఆ పార్టీలో చేరాడు..ఫైనాన్షియల్‌‌గా బ్యాక్ బోన్ అయ్యాడు..ఆ పార్టీకి కావాల్సిినంత పని చేసాడు..తానూ పనులు చేయించుకున్నాడు..తీరా తెలంగాణ వచ్చింది..ఏం జరిగిందో చూసాం..ఇప్పుడు కాదు కదా
కేసీఆర్ బతికి ఉన్నంతవరకూ కూడా ఇంకో వ్యక్తి సిఎం అయ్యేదానికి అవకాశం లేదు(కనీసం టీఆర్ఎస్ పార్టీలో)

ఆ వ్యక్తి ఈ పాటికి ఊహించే ఉంటారు..వివేక్..ఎంపిగా ఉండి..టిఆర్ఎస్‌లో చేరిపోయి ముఖ్యమంత్రి తానే అవుతానని కలలు కన్నాడట..ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరాడు..మళ్లీ టీఆరెస్ అన్నాడు..ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి కూడా ఇలానే బిజెపిలో చేరతా..నేనే సిఎం అవుతా అంటుంటే..ఆ ఎపిసోడ్ గుర్తుకురాకమానదు

Comments