రామ్ చరణ్ ఎస్వీఆర్ సినిమాలు చూస్తూ పెరిగాడా...ఇండస్ట్రీలో ఎన్నాళ్లైనా ఈ గజ్జి పోదా

ఎస్వీ రంగారావుగారు గొప్ప నటులే సందేహమే లేదు..ఓ పక్కన ఎన్టీఆర్..మరో పక్కన ఏఎన్నార్..అంతకు ముందే వచ్చేసిన వి.నాగయ్య, జగ్గయ్య..తర్వాత వచ్చిన గుమ్మడి, మిక్కిలినేని.. ముక్కామల, సిఎస్సార్, సత్యనారాయణ ఇంతమంది హేమాహేమీలతో పోటీ పడి తనకంటూ ఓ స్టైల్..ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు..అసలు ఎంతమందిలో ఉన్నా ఆయనకే ఉపమానాలు అక్కర్లేదు కూడా..
అలాంటి నటుడికి కులం అంటగట్టడం ఓ పదిహేనేళ్ల క్రితం నుంచి ప్రారంభమైంది..ఇపుడు తాజాగా మెగాస్టార్ మహానటుడి గురించి చెప్పుకొస్తా..తన తండ్రి వెంకట్రావ్ గారు ఆయనతో జగత్ కిలాడీలు..జగత్ జెట్టీలలో నటించిన సంగతి గుర్తు చేసుకున్నారు..ఆ సందర్భంలోనే ఆయన ఎస్వీరంగారావ్ గురించి ఆయన ఇలా నటించేవారు..ఇలా చూసేవారు..అని ఇంట్లో చెప్పగా విని ఎంతో సంబరపడినట్లు చిరు చెప్పాడు. అక్కడే ఆయనంటే ఇష్టం ఏర్పడిందని..అది ఆరాధ్యనటుడనే స్థాయికి వెళ్లిందని చెప్పాడాయన
ఐతే నిజంగా ఎస్వీఆర్ బుక్ ఆవిష్కరణ కాబట్టి..మర్యాదపూర్వకంగా చెప్పారో..లేక చిరు అంతరంగంలోని అసలు మాటే అదేమో కానీ...ఎస్వీ రంగారావుగారే తనకి నటనపై ఆసక్తి పెరగడానికి..ఉద్భవించడానికి కారణమని గతంలో  ఎప్పుడూ పెద్దగా చెప్పినట్లు లేదు..కానీ అప్పుడెప్పుడో డిసీలో సావిత్రి ఎస్వీఆర్ , చిరంజీవి గురించి రాస్తూ..వీరంతా ఒకే కులం అని చెప్పుకొచ్చినట్లు చదివాం..దానిపై అలా కులం ఆపాదించవద్దంటూ అప్పుడే కొందరు కోప్పడ్డారు కూడా..బహుశా అప్పట్నుంచే వీరి గురించి చిరు చెప్పుకోవడం ప్రారంభమైందనే పుకార్లైతే ఉన్నాయ్..

ఎందుకంటే..చిరు ఎప్పుడూ తన అభిమాననటుడు ఎన్టిఆర్ అనో..అమితాబ్ అనో చెప్పడమే ప్రముఖంగా కన్పించేది..(అఫ్కోర్స్..ఎక్కువ పబ్లిష్ అయ్యేవే అవి కావచ్చు..ఈయన ఎస్వీఆర్ సావిత్రి కన్నాంబ పేరు చెప్పినా..)పైగా తన ఇంట్లో రామ్ చరణ్ కూడా రంగారావుగారి సినిమాలు చూపించేవాడిని అని చెప్పడం మాత్రం అతిశయోక్తిగానే చెప్పాలి..ఎందుకంటే రామ్ చరణ్ ఎక్కడా ఆ ప్రస్తావన తీసుకువచ్చేవాడు కాదు..పైగా చిరు మాటల్లో చెప్పాలంటే..రామ్ చరణ్ ఎస్వీఆర్ యాక్టింగ్ చూసి" ఆ కాలంలోనే అంత భావం..ఆ స్థాయి నటన డిక్షన్ పై కమాండ్..ఉన్నాయంటే చాలా గ్రేట్ " అని అన్నాడట..ఇదే అతి చేయడం అంటే..నిజానికి నటనకి కాలంతో సంబంధం ఏంటి..పైగా అదేం గ్రాఫిక్స్...టెక్నాలజీ కాదు..ఆ కాలంలోనే అని అనడానికి..కేవలం ఇది తమవారనే ఆనందంతోనే ఇలా అతిశయోక్తి వ్యాఖ్యానం చేసారని విమర్శలు వస్తున్నాయ్..కానీ వాస్తవానికి చిరంజీవి మనస్ఫూర్తిగా ఈ మాటలు అని ఉంటే అలా భావించేవాళ్లు తప్పు చేసినట్లే..అలానే నేను కూడా

Comments