తెలుగు దేశానికి దిక్చూఛీ ఈ జ్యోతి

కేవలం తన రాతల వలనే చంద్రబాబు ఓడిపోయాడు అని కొంతమంది అంటుంటే..అంత సీన్ లేదు..అనేక కారణాలతో టిడిపి ఓడిపోయిందనుకుంటాం..నిజం కూడా..కానీ ఇప్పుడు ఇతగాడి కొత్త పలుకు..వక్క పలుకు చదివినా..విన్నా కంపరం ఎక్కిపోవడం ఖాయం.క్రైస్తవమతం ..బిసిలను క్రైస్తవంవైపు మళ్లించడానికి పావులు కదుపుతున్నారని చెబుతున్నారట..ఎవరో ఈ చెప్పేది..పాపం..అది మాత్రం రాయరు

తెలుగుదేశం విలీనం కాలేదని..ఈయన అనడం..అయింది అని ఇంకోరు అనడం అసహజం..సభలో పార్టీ కలిసిపోతుందేమో కానీ..అసలు పార్టీ ఎక్కడకీ పోదు..గందరగోళపరిచే ఈ వ్యాఖ్యలెందుకు మధ్యలో...తొక్కలోది..అంటే ఏతావాతా మనం చెప్పొచ్చేది వెంకయ్య ఎప్పుడూ బొంకడు..లొంగడు అని...అన్నీ పార్టీలకు పాపం అంటుకుందట..పాపం టిడిపి తీసుకున్నప్పుడు ఈ సన్నాయి మేళం ఎందుకు వాయించలేదో మరి..పైగా అందులో అన్ని పార్టీలను కలపడం ద్వారా ఇదేం పెద్ద తప్పు కాదు గతంలో  టిడిపి చేసింది  అని చెప్పడమేనా రాకీ రాతల రహస్యం

వాస్తవానికి సుజనా చౌదరి..సిఎం రమేష్ కి ప్రజాబలం లేదట..మరి ఇదే నేతలు మంగళహారతులు పట్టినప్పుడు ఏమైంది ఈ తెలివిడి..ఇలాగే కదా..పోయేవాళ్లు పనికిమాలినవాళ్లని బాబు వ్యాఖ్యానించింది..ఇలాంటి వాళ్ల మద్దతుతోనే కదా..పార్టీ ఓటమితో పార్టీ నాశనం అయిందని ఎవరూ అనరు..అనుకుంటే అంతకంటే అవివేకం ఉండదు

ముందు బాబుని వేస్తారట..తర్వాత జగన్‌ని అట..అబ్బా..ఏం ఆశల్రా బాబూ...
అక్కడికేదో...తర్వాత ఇక జగన్ జైలుకి పంపిస్తారు..బాబుని తొక్కేస్తారు..ఏపికి దిక్కులేక బిజెపిని గెలిపిస్తారు ఇంతకన్నా దరిద్రపు ఆలోచన ఇంకోటి వస్తే..అది దిక్చూఛీ జోతెందుకు అవుతుంది..గత ఐదేళ్లుగా పాడుకుంటున్న రాగంలో కాస్త తాళింపు మేళవించిందే తప్ప ఇంకోటేమైనా ఉందా..అక్కడికి వీళ్ల కలలు పండి జగన్ జైలుకి వెళ్తే..పార్టీ నాశనమైపోతుందట..మరే..పాపం..అంత అమాయకుడిగా జగన్ కన్పించాడు కాబట్టే...2019 ఎన్నికల తీర్పు గూబ గుయ్ మనిపించింది. ఈ మాత్రం రోత రాతలకి 30ఏళ్లు జర్నలిజం చేయాలా...ఏ రచ్చబండ దగ్గర జనాల్ని అడిగితే ఇంతకంటే ఎక్కువ మసాలా ఆశల సినిమా చూపిస్తారు

Comments


  1. అదేమండీ ఛీ అనేసారు ? :)


    దిక్చూ, ఛీ ఈ జ్యోతి :)



    జిలేబి

    ReplyDelete
  2. అంధకోతి వెకిలి వేమూరి బాధాకృష్ణ లాంటి కులగజ్జి వంధిమాగధుల ప్రచా(సా)ర ఓవరాక్షన్ వల్లనే 120-130 సీట్లు రావాల్సిన వైకాపా 151 సీట్లు గెలిచింది. జగన్ ఓట్ల సునామీలో ఇదండీ పచ్చ కామెర్ల అనుకుల మీడియా కాంట్రిబ్యయేషన్. A foolish "fiend" is more dangerous than an intelligent enemy!

    ఇప్పటికీ సోయి రాకుండా ఇవే పెరుగుతున్న కిరస్తానం తరహా చెత్త పలుకులు రాస్తానే ఉంటే చదివే వాళ్లకు కామెడీ పండుద్దేమో కానీ పొటాష్ గాంగ్ మొత్తంగా మటాష్ ఐపోద్ది.

    ReplyDelete

Post a Comment