వారసులమని చెప్పుకుంటే కాదు..ఇలా పోలికలతో సహా దిగిపోవాలి

నందమూరి వంశంలో వారసుల తాకిడి ఎక్కువే..రాజకీయరంగంలో లేదు కానీ...సినిమారంగంలో మాత్రం ప్రతివాళ్లూ తమ కులం, అభిమానగణం, పార్టీ అనుచరగణంపై బోలెడంత భరోసాతో లక్ టెస్ట్ చేసుకున్నవాళ్లే..ఐతే సిసలు వారసుడిగా మొదటి తరంలో బాలకృష్ణ మాత్రమే నిలబడిగలిగి..షష్టిపూర్తి వయసు వరకూ రాణించగలిగాడు..ఇప్పుడంటే దశాబ్దానికి ఒక సినిమా హిట్ తో లాగిస్తున్నాడు కానీ..ఒకప్పుడు బాలయ్య సినిమాలంటే బాక్సాఫీసులు బద్దలు అయ్యేవి..పామరజనాన్ని రంజింపజేయడంలో బాలయ్యదో వినూత్న పంథా

దానినే అనుసరించాలని చాలామంది చూసినా అది వర్కౌట్ అవలేదు..ఆ తర్వాత తారకరత్న, చైతన్యకృష్ణ, కల్యాణ్ రామ్ సహా చాలామంది ట్రై చేసినా..తారకరామారావ్ అనబడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సక్సెస్ అయ్యాడు..ఎన్టీఆర్ పోలికలు కావాల్సినన్ని కన్పించడమే అతని అస్సెట్ అనుకోవడానికి లేదు..కొత్త తరానికి కొత్త ఎన్టీఆర్‌లా అలరించడంతోనే అతని సక్సెస్ దాగి ఉంది..

ఇప్పుడు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ చూస్తే..అటు ఎన్టీఆర్ పోలిక కానీ..బాలయ్య పోలిక కానీ కన్పించవ్..తల్లితరపు పోలికలు కన్పిస్తుంటాయ్.. పైగా అతనికి సినిమాలంటే పెద్దగా ఇంట్రస్ట్ లేదని కూడా ఓ ప్రచారం  సాగుతోంది..అదెంతవరకూ నిజమో తెలీదు..కానీ ఈలోపున జూ నియర్ ఎన్టీార్ కి ఇద్దరు జూనియర్లు పుట్టడం అతని ఫ్యాన్స్‌కి సంబరం కలిగించే వార్తే..అభయ్ రామ్..భార్గవ్ రామ్ ఇద్దరిలోనూ ఎన్టీఆర్ పోలికలు బాగా కన్పిస్తుండటంతో..ఇక ఫ్యూచర్ నటులు ఉద్భవించినట్లే అనుకోవాలి..ఇప్పుడే వారి కెరీర్‌పై డెసిషన్స్ , ఊహాగానాలు చేయడం కరెక్ట్ కాకపోయినా...బోలెడంత...గణం మోయడానికి సిధ్దంగా ఉండగా..వారు వేరే కెరీర్‌వైపు వెళ్తారంటే నమ్మలేం..


Comments