అ.ఆ మీనా సంగతి సరే మిగిలిన సినిమాల సంగతేంటట..త్రివిక్రమ సీనివాసా


మనుషులు చనిపోయేటప్పుడు చెప్పిన మాట తిరుగులేనిదిగా..ఏ కోర్టులోనైనా నిలబడే సాక్ష్యంగా నిలుస్తుంది..అలాంటివాటిని కూడా డబ్బుతో కొన్న రాజకీయనాయకులు చాలామందే ఉన్నారు..ఐతే నిజం ఏదో రోజు బైటికి రాకతప్పదు..ఇప్పుడు త్రివిక్రమ శ్రీనివాస విషయంలోనూ ఇదే జరిగింది..కాకపోతే పాపం ఆయన పోలేదు కానీ..విజయనిర్మలగారు మృతికి సంతాపం తెలుపుతూ ఓ వాస్తవం అంగీకరించారు..

మీనా సినిమా స్పూర్తితోనే అ..ఆ తీశానని చెప్పుకొచ్చారు..ఆ సినిమా రిలీజైన మొదటి రోజే బోలెడుమంది ఈ మాట చెప్తే కాదన్నారు..ఠాట్...ఎవడి బాల్స్ వాడు పిసుక్కోండంటూ తమ స్థాయికి తగ్గ చెణుకులు విసిరారు. చివరకు రచయిత్రి యధ్దనపూడి సులోచనారాణిగారు కూడా ఇది తన మీనాకి కాపీనే అంటూ చెప్పారు..ఆ తర్వాతెప్పుడో సబ్ టైటిల్స్ లో ఆమెకి కృతజ్ఞతలనే వ్యాక్యం చూసినట్లు గుర్తు..

ఇప్పుడు అంగీకరించినందువలన, అప్పుడు అంగీకరించనందువలన..నష్టం లాభం లేకపోయినా...మనిషి నిజాయితీ
ఋజువర్తనలకు ఇవే గీటురాళ్లుగా మిగులుతాయి..పైగా ప్రతి సినిమాలో మానవబంధాలు..స్పందనలు  అంటూ బోలెడంత సెంటిమెంట్ గుమ్మరించేవాళ్ల నుంచి జనం వాటిని ఎక్కువగానే ఎక్స్ పెక్ట్ చేస్తారు..విషాదంగా ఆ (సిని) జనం నుంచే ఇవి చాలా తక్కువ కన్పిస్తాయ్..ఇప్పటికైతే ఓ సినిమా గురించి అంగీకరించాడు కానీ...మరి అప్పుడెప్పుడో తీసిన అతడు వారసుడొచ్చాడుకి అనుకరణ అని..తర్వాత తీసిన ఇంకొన్ని కూడా ఇంకొ్న్నివాటికి కాపీలను అన్నప్పుడైనా చెప్పాలి కదా..ముందే అనుకున్నాం కదా..అంగీకరించకపోయినా నష్టం..లాభం లేదని..కానీ....!

Comments

  1. అతడు సినిమా french kiss అనే ఇంగ్లీష్ సినిమాకి అనుసరణ. అతడు కి ముందు హిందీలో ప్యార్ తో హోనా హి తా అని కాపీ కొట్టారు. తెలుగులో దొంగాట అని కాపీ కొట్టారు.

    ReplyDelete
  2. బోనగిరి గారు,
    French Kiss అనే ఆంగ్లచిత్రానికి అనుసరణ "దొంగాట" చిత్రం అన్నది కరక్టే (సౌందర్య, జగపతిబాబు, సురేష్), పైన మీరన్న "అతడు" చిత్రం కాదు ( త్రిష, మహేష్ బాబు, నాజర్)

    ReplyDelete

Post a Comment