బ్యాక్ టు సినిమా....విజయశాంతి..చిరంజీవి..బాలకృష్ణ


లేడీ అమితాబ్ ఈజ్ బ్యాక్..ఔను..చడీ చప్పుడూ లేకుండా వచ్చిన ఈ న్యూస్ విజయశాంతి అభిమానుల్లో ఆనందం నింపింది. ఓరకంగా 2019 ఎన్నికల ఫలితాలు ఒకప్పుడు తెరపై వెలిగి పాలిటిక్స్‌లోకి వెళ్లిన  టాప్ స్టార్స్‌కి ఓ మార్గం చూపించాయని చెప్పాలి. ఈ వరసలో ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి..చిరు ఇక పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత ఐదేళ్లుగా పాలిటిక్స్‌కి దూరమైన చిరు..వెండితెరకే
తన ఓటు వేసారట.  గతం చూస్తే.. ఈయన ప్రజారాజ్యం స్థాపించడం ఆ తర్వాతి పరిణామాలలో దాన్ని కాంగ్రెస్‌లో కలిపేయడం వెంటవెంటనే జరిగిపోయాయ్..కేంద్రమంత్రిగా కూడా పని చేసిన చిరంజీవి..ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్‌కి దూరంగా ఉఁడిపోయారు. అలానే తనకి అచ్చొచ్చిన సినిమా ఇండస్ట్రీనే మరోసారి పలకరించారు.  2009 ఎన్నికల సమయంలోనే సినిమాల్లోకి చిరు రీఎంట్రీ కన్ఫామ్‌గా ఉంటుందని చాలామంది ఊహించారు ..సుదీర్ఘ విరామం తర్వాత 2017లో ఖైదీ నంబర్ 150తో ఫ్యాన్స్‌కి ఆనందం మిగిల్చారు..ఆ తర్వాత తన ఇమేజ్ మరింత పెంచుకునే్ందుకు కర్నూలు సమరయోధుడి కథ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టాలెక్కించారు..ఐతే ఈసారి మాత్రం ఈ ప్రాజెక్ట్ అంత వేగంగా ముందుకు కదల్లేదు..కథలో స్పాన్ వల్లనో..ఇతర కారణాలతోనో
ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉఁది..ఐతే ఈ మధ్యకాలంలో చిరంజీవి కాంగ్రెస్‌కి దూరంగా ఉండటం గమనించాలి..

తమ్ముడు పెట్టుకున్న జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగినా..దానికి కూడా దూరంగానే ఉన్నారు..ఇప్పుడిక ఎపి అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా  ముగియడంతో..చిరంజీవి పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టినట్లు క్లియర్‌గా కన్పిస్తోంది. సందర్భం వచ్చింది కాబట్టి..మెగాబ్రదర్ పవన్ కల్యాణ్ కూడా డిటో సిచ్యుయేషన్‌లోనే ఉన్నట్లు సినిమావర్గాలు ఈ మధ్యవరకూ అంచనా వేసాయ్. ఐతే జనసేన నియోజకవర్గాల వారీ సమీక్షలు జరుపుతుండటంతోపాటు తనకి  సినిమాలు చేసే ఉద్దేశం లేదని పవన్ కల్యాణ్ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ పాలిటిక్స్‌  సీరియస్‌గానే నడుపుతున్నారనుకోవాలి..

లేటెస్ట్ బజ్ చూస్తే..లేడీ సూపర్‌ స్టార్ విజయశాంతి కూడా తిరిగి సినిమాలు చేయాలని డిసైడయ్యారు. దీంతో 13 ఏళ్ల తర్వాత తమ అభిమాననటినితెరపై కన్పించనున్నందున ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. హీరోయిన్లకు అంతగా ప్రాధాన్యత దక్కని రోజుల నుంచి..తానే ఓ మెయిన్‌రోల్‌గా సినిమాలు చేసే స్థాయికి ఎదిగిన ఏకైన నటి విజయశాంతి..అలాంటి పాత్రలలో ఒసేయ్ రాములమ్మా క్యారెక్టర్ పీక్ అని చెప్పుకోవాలి..ఆ క్యారెక్టర్‌తోనే తెలంగాణ వాసుల మసను గెలిచి..తెలంగాణ తల్లి అనే ఓ పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిందామె. ఓ నటి సొంతంగా పార్టీ పెట్టడం అనేది దాదాపు భారతదేశంలో ఎక్కడా జరగలేదంటే అతిశయోక్తి కాదు..తన పార్టీ టిఆర్ఎస్‌లో కలిపినా..ఎంపిగా మారినా విజయశాంతి సినిమాలు చేస్తే చూడాలని చాలామందికి ఉండేది..ఐతే ఆమెకి మాత్రం ఆ ఉద్దేశం లేకపోవడంతో ఆ ఆశ నెరవేరలేదు..ఐతే లేటెస్ట్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా..అనిల్ రావిపూడి తీసే సరిలేరు నీకెవ్వరూలో ఓ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోవడంతో విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ తెరపై ప్రారంభమైనట్లే చెప్పుకోవాలి. మహేష్ లిటిల్ సూపర్‌స్టార్‌గా ఉన్న రోజుల్లో కొడుకు దిద్దిన కాపురం అనే సినిమాలో విజయశాంతి ఆయన తల్లిగా నటించారు. ఇది 1989లో విడుదలై మంచి హిట్టైంది..తిరిగి ఇదే కాంబినేషన్ వర్కౌట్ అవడానికి ఖచ్చితంగా 30 ఏళ్లు పట్టింది. ఐతే ఇందులో వీరిద్దరి క్యారెక్టర్ల మధ్య రిలేషన్ తెలీకపోయినా..ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీలవుతున్నారు.

నిర్మాత బండ్ల గణేష్ విషయం చూస్తే రాజకీయాల్లో ఏదో ఇరగదీస్తానని ప్రకటనలు ఇచ్చిన ఈయన తీరు చూసి నెటిజన్లు ఇప్పటికీ జోకులు వేసుకుంటుంటారు..ఐతే ఆయన మాత్రం దాన్ని లైట్ తీస్కుని హ్యాపీగా మళ్లీ సినిమాలు
తీసుకునేందుకు సిధ్దమవుతున్నారు. ఇప్పటిదాకా చెప్పుకున్నచిరంజీవి, విజయశాంతి, బండ్లగణేష్ విషయాన్నే చూస్తే..వీళ్లంతా తాము అంచనా వేసుకున్న స్థాయికి చేరలేని వాళ్లే..వీరిలో చిరంజీవి, విజయశాంతి  మాత్రం
సినిమాలతో  ప్రజల్లోతిరిగి ఆదరణ పెంచుకుని మళ్లీ పాలిటిక్స్‌వైపు మళ్లుతారేమో మాత్రం చెప్పలేం..

ఇక నటుడు బాలకృష్ణ చూస్తే..ఆయన టిడిపి తరపున ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచారు. ఐతే 2014 నుంచి కూడా ఆయన హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి..రెండు పడవలపై ప్రయాణం బాలయ్యకి అలవాటే అనుకోవాలి.
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా..ఓ పొలిటీషియన్‌గా కంటే కూడా జబర్దస్త్ రోజాగా పాపులర్..ఐనా
కేబినెట్‌లో బెర్త్ కనుక దొరికితే ఆమె టివిషోలు చేయకపోవచ్చని అంటున్నారు. ఇంకా చాలామంది నటులు, చిత్రరంగ నేపధ్యం ఉన్నవారు రాజకీయాల్లోకి వచ్చినా సరే ,వారిని కదిలించినప్పుడు సినిమాల్లో ఉన్న తృప్తి ఇంకే రంగంలో లేదని చెప్తుంటారు..ఐతే పాలిటిక్స్‌లో మంచి హోదా ఉన్నప్పుడు సినిమాలను పక్కనబెట్టడం ..రాజకీయంగా ప్రాముఖ్యత దక్కనప్పుడు సినిమాలవైపు చూస్తుండటం మాత్రం ప్రేక్షకులు
గమనిస్తూనే ఉంటారు..ఏదెలా ఉన్నా ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల ఆరాధ్యదైవాలు తిరిగి తెరపై కన్పించబోవడం వారికి ఆనందం కలిగించే విషయమే

Comments

  1. నిన్నటి సౌత్ ఆఫ్రికా మాచీ గెలిపించిన "అన్నీ నేనే" నారా బాబు గారికి వందనాలతో:

    దేశంలో సీనియర్ లీడర్ నువ్వే
    సింధుకు బాడ్మింటన్ నేర్పించింది నువ్వే
    సత్య నాదెళ్లకు కంప్యూటర్ ఇచ్చి,అమెరికాకు పంపింది నువ్వే
    రోహిత్ శర్మ కి సెంచరీ చెయ్యమని చెప్పింది నువ్వే
    అన్నిటికి నేనే-నేనే అనే నువ్వు మందళగిరి మాలోకం లోకేష్ ని మాత్రం MLAగా గెలిపించుకోలేకపోయావ్

    ReplyDelete
    Replies

    1. బిల్ గేట్స్ చేత మైక్రోసాఫ్ట్ , రామలింగరాజు గారి చేత సత్యం కంప్యూటర్స్ పెట్టించింది నువ్వే .....అని కూడా అందామా? ఇంక
      వదిలెయ్యండీ జై గారూ. అధికారం కూడా చేజారిపోయింది. ఇంకా ఏం దెప్పిపొడుస్తారు?

      అయినా ఇక్కడ టాపిక్ "బ్యాక్ టు సినిమా" కదా. చంద్రబాబు గారికేం సంబంధం లేదుగా.

      హిరణ్యకశిపుడికి ఎల్లవేళలా విష్ణు (వైరి) నామ స్మరణ లాగా మీకు చంద్రబాబు నామ స్మరణా ఏమిటి? Cool.

      Delete
    2. చాకిరేవు కంటే గొట్టిముక్కలే అసలైన చంద్రభక్తుడు!
      మొదటాయన భోజనం చేసేప్పుడైనా స్మరణ ఆపుతాడేమో కానీ రెండో వ్యక్తి తనకి చెయ్యి కడుక్కోవడం నేర్పించింది చంద్రబాబా కాదా అని ఆలోచిస్తుంటాడు!

      Delete
  2. కొందరికి అంతే మాస్టారూ..మీరూ జస్ట్ లైట్ తీస్కోంది..విన్నకోట గారూ

    ReplyDelete
  3. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే! రాజకీయం రాజకీయమే సినిమాలు సినిమాలే!

    ReplyDelete

Post a Comment