సూపర్...స్టార్..మహేష్ స్టామినా

సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్‌కి పండగ లాంటి వార్త..మహర్షి సినిమా 36వ రోజు కూడా కోటి రూపాయలు కలెక్ట్ చేసిందట..సిటీస్ లో మాత్రమే సమ్మర్ లో థియేటర్లకు వస్తారు..చిన్న ఏరియాల్లో ఎండల దెబ్బకి బైటికి రావడమే మానేస్తారు అనే నమ్మకాన్ని తుడిచిపెట్టేసిందీ సినిమా..నరసరావుపేటలాంటి మాంచి ఘాటైన ఏరియాలో కూడా నిప్పులు చెరిగే ఎండలో  ఈ మూవీకి ఇంకా  క్యూలైన్లో నిలబడి టిక్కెట్లు కొనడం కన్పిస్తుంది..ఇదే సినిమా సక్సెస్ కి నిదర్శనం..దానికి తగ్గట్లే రన్నింగ్ కూడా ఇరగదీస్తుందని ఇప్పుడు న్యూస్ కన్ఫామ్ అయింది..

సో కనీసం 120 సెంటర్లలో మహర్షి 50 రోజుల పోస్టర్ చూడబోతున్నాం..ఇప్పుడున్న హీరోలలో కేవలం ఒక్క మహేష్ బాబుకే ఇలా 50 రోజులు..వంద రోజుల పోస్టర్లు చూడగలుగుతున్నాం..బహుశా సూపర్ స్టార్ల తరంలో మహేష్ బాబే చివరి సూపర్ స్టారేేమో...ఒక్కడు..పోకిరి, దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు..బిజినెస్ మేన్, శ్రీమంతుడు, భరత్ అనే నేను..ఇప్పుడు మహర్షి..ఇలా 100 డేస్ పోస్టర్స్ కనీసం 50 సెంటర్లు దాటి పడటం అంటే చిన్న విషయం కాదు..ఇక ఫ్లాప్ అయిన వన్, ఆగడు లాంటి సినిమాలు కూడా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లు..దేశంలో వందకోట్ల రూపాయలకు దగ్గరగా కలెక్ట్ చేయడం అతని స్టామినాకి నిదర్శనమే..అన్ని సమాచారాలను క్రోడీకరించిన తర్వాత తేలుతుందేమిటంటే..మహర్షి జూన్ 14 నాటికి రూ.173.10కోట్లు కలెక్ట్ చేసిందట..నైజామ్ లో 31.3కోట్లు..సీడెడ్ లో 10.6 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ (అమెరికా)లో 12.22 కోట్ల రూపాయలు..ఈస్ట్ గోదావరిలో రూ.7.4కోట్లు, వెస్ట్‌లో రూ.5.93కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.5.8కోట్లు, గుంటూరులో రూ.7.98కోట్లు, నెల్లూరులో రూ.2.92కోట్లు నెట్ రూ.84.15కోట్లు..కర్నాటక రూ.14కోట్లు..  ఓవర్సీస్ రూ.12.8నెట్ కలిపి ,షేర్ మొత్తం రూ.110.95కోట్లు వసూలు చేసిందట..
దీంతో నిర్మాత ఫుల్ ఖుషీ ఎందుకంటే..ఇప్పటికే బ్రేకీవెన్ సాధించిన ఈ సినిమాకి..ఇక శాటిలైట్ రైట్స్, డిజిటల్  రైట్స్ కనీసం రూ.40కోట్లు అమ్ముడుకాబోతున్నాయ్..అంటే నికరంగా ముగ్గురు నిర్మాతలు పంచుకున్నా..ఒక్కోరికి రూ.13కోట్లు లాభం..ఇదీ మహేష్ బాబు స్టామినా..ఇదంతా యావరేజ్ అని టాక్ వచ్చినందుకే..ఇక ముందునుంచీ బ్రహ్మాండం అని టాక్ వస్తే ఇంకెంత వసూలు  చేసేదో..

Comments