జగన్ టీమ్ ఎంపికలో సాన్నిహిత్యం అనుభవానికే పెద్ద పీట-ముగ్గురు నానిలకు చోటు..


వైఎస్ జగన్ టీమ్...ఇది అచ్చంగా ఆయన ఎంపికే అనడంలో సందేహం లేదు..150 మంది నుంచి 25మందిని ఎంపిక చేయడం అంటే  ఆషామాషీ విషయం కాదు..ఒక్కోసారి సన్నిహితులకు తొలినాటి నుంచి నడిచినవాళ్లకి కూడా హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది..ఇప్పుడదే జరిగింది కూడా రోజా..అంబటి రాంబాబు, ధర్మాన ప్రసాదరావ్ వంటి పేరున్న..అందరికీ తెలిసి ఉన్న లీడర్లకి హ్యాండ్ ఇచ్చింది గమనిస్తే..జగన్ పెద్ద కసరత్తే చేసి ఉంటాడనుకోవాలి.

ఐతే మంత్రివర్గంలోని పేర్లని చూస్తే మాత్రం గతంలో మంత్రులుగా చేసినవాళ్లు..జగన్‌కి సన్నిహితులుగా మెలుగుతున్నవాళ్లే ఎక్కువ..ఇక ఇందులో ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లిం..అనే కేటగరీలు వెతకడం అనవసరం..వాళ్లు జస్ట్ జగన్‌కి నచ్చారు అంతే..అంటే దీన్ని ఇఁకోరకంగా కూడా చెప్పొచ్చు..జగన్‌కి ఏ కులం మతం అనేది సంబంధం లేదు..పని తీరు నచ్చితే చాలు అక్కున చేర్చుకుంటాడనుకోవాలి.

పెద్దిరెడ్డి, బొత్స, బాలినేని, మోపిదేవి, విశ్వరూప్ బుగ్గనకి అనుభవం ఉంది..కానీ వీరిలో మోపిదేవి ఓడిపోయినా తిరిగి చోటు ఇచ్చాడంటే ఎక్స్‌పీరియెన్స్‌డ్ మనుషులు కావాలనే. ఇక బుగ్గన రాజేంద్రనాధ్ పిఏసీ ఛైర్మన్‌గా చేశాడు కాబట్టి..లెక్కల్లో దిట్టగా తీసుకుని ఉంటాడు..మేకతోటి సుచరిత, పుష్పశ్రీవాణి, వనిత ముగ్గురు మహిళలకు
చోటు కల్పించడం పార్టీ వెన్నంటే ఉన్నందుకు దక్కిన అవకాశంగా చెప్పాలి. అనిల్ కుమార్ యాదవ్ సంగతి చూస్తే..ఎంత రఫ్ అండ్ టఫ్‌గా జనాలని ఆకర్షించేలా మాట్లాడతాడో అంతే స్థాయిలో జగన్ అంటే విధేయత కనబరుస్తాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి లోకేష్‌ని ఓడించినందుకే పదవి ఇచ్చారనుకోవడం భ్రమ..ఎందుకంటే న్యాయవ్యవహారాల్లో  టిడిపిని ముప్పు తిప్పలు పెట్టిన వైనం తెలిసినవాళ్లు ఆయనకి న్యాయశాఖే అప్పగిస్తారనుకోవచ్చు. కురసాల కన్నబాబు, కొడాలి నాని, ఆళ్ల నాని, పేర్నినాని..జగన్ వెంట నడిచినందుకు దక్కిన ప్రతిఫలంగా అనుకోవాలి. వీళ్లకి మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది..కానీ మంత్రులుగా మారిన తర్వాత తీరు మార్చుకుంటారో అలానే  బిహేవ్ చేస్తారో చూడాలి


కురసాల కన్నబాబు-కాకినాడ రూరల్
బొత్స సత్యానారాయణ- చీపురుపల్లి
ధర్మాన కృష్ణదాస్- నరసన్నపేట
అవంతి శ్రీనివాస్-భీమిలీ
పుష్పశ్రీవాణి-కురుపాం
బాలినేని శ్రీనివాస్‌రెడ్డి-ఒంగోలు
పినిపె విశ్వరూప్-అమలాపురం
ఆళ్ల నాని-ఏలూరు
కొడాలి నాని-గుడివాడ
శ్రీరంగనాథ రాజు-ఆచంట
పేర్ని నాని-మ‌చిలీప‌ట్నం
తానేటి వనిత-కొవ్వూరు
మేకతోటి సుచరిత-ప్రత్తిపాడు
వెల్లంపల్లి శ్రీనివాస్-విజయవాడ ఈస్ట్
ఆళ్ల రామకృష్ణారెడ్డి(మంగళగిరి)
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(పుంగనూరు)
మేకపాటి గౌతమ్‌రెడ్డి(ఆత్మకూరు)
మోపిదేవి వెంకటరమణ(గుంటూరు జిల్లా)
అనిల్ కుమార్ యాదవ్(నెల్లూరు సిటీ )
బుగ్గన రాజేంద్రనాథ్ (డోన్)
నారాయణస్వామి(గంగాధర నెల్లూరు)
గుమ్మనూరు జయరాం(ఆలూరు)
శంకర్ నారాయణ(పెనుగొండ)
అంజద్ బాషా(కడప)
ఆదిమూలపు సురేష్(ఎర్రగొండపాలెం)

Comments