డ్యాన్స్ రాదన్న కృష్ణ..చిరంజీవి ఏం చేశాడు మరి..!


సూపర్ స్టార్ కృష్ణ..మెగాస్టార్ చిరంజీవి ఇద్దరూ హీరోలుగా నటించిన సినిమా ఒకట ిఉంది..కృష్ణ హీరోగా ఉన్న సమయంలో చిరంజీవి చిన్న క్యారెక్టర్లే వేసేవాళ్లు..అంతకి మించి ఆయన రేంజ్‌కి దక్కేవి కాదు..కానీ ఇతర సినిమాల్లో హీరోగా చేసేవాడు. ఇద్దరూ హీరోలుగా చేసిన సినిమా మాత్రం అదే..తోడుదొంగలు

ఇప్పటికీ ఈ ఇద్దరూ కలిసి  ఓ చోట కన్పిస్తే ఇదే టైటిల్‌తో పిలుస్తుంటారు కూడా..ఆ సినిమాలో ఎక్కువ పాత్ర పరిధి కృష్ణదే అయినా..చిరంజీవి లెంగ్త్ కూడా ఎక్కువే(మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే ) కన్పిస్తుంది..సినిమా నిర్మాత..మహేంద్ర. ఈయనే ఆరుగురు హీరోలను తెలుగుతెరపై ఇంట్రడ్యూస్ చేశారు . కె.వాసు డైరక్టర్..1981లో వచ్చిందీ సినిమా..సత్యం సంగీతంలో అన్ని పాటలూ అలరిస్తాయ్..ఈ పాటల దగ్గరకి వచ్చేసరికి ఇప్పుడు సూపర్ డ్యాన్సర్‌గా చెప్పుకుంటోన్న మెగాస్టార్..డ్యాన్స్ డైరక్టర్ శ్రీనివాస్ గారి దగ్గర బాగా ఇరకాటం పెట్టేశారట..

 నాకు రిహాల్సల్స్ కావాల్సిందే..అంటూ డ్యాన్స్ డైరక్టర్‌ని అడిగితే..ఆయనేమే అవసరం లేదు నువ్ బాగా చేస్తున్నావ్..చేస్తావ్ కూడా అంటే వినలేదట..దీంతో ఆయనే చిరంజీవిని దూరంగా కూర్చున్న కృష్ణ దగ్గరకి తీసుకెళ్లి సార్..ఇతను రిహాల్సల్స్ కావాలంటున్నాడు మీరైనా చెప్పండి అన్నాడట. దానికి కృష్ణగారు.." చిరంజీవీ...నాకు డ్యాన్స్ రాదు..కానీ నువ్ బాగా చేస్తావ్ నాకు తెలుసు కాబట్టి ఆ భయమేం పెట్టుకోకు" అని అనేసరికి చిరంజీవి భయం పోయిందట..ఇది సదరు డ్యాన్స్ డైరక్టర్ శ్రీనివాసే స్వయంగా చెప్పిన మాట..ఇంత ఫ్రాంక్ గా నిజాయితీగా మాట్లాడతారు కాబట్టే..కృష్ణ సూపర్ స్టార్ అయ్యాడని..హార్డ్ వర్క్ చేస్తాడు కాబట్టే..చిరంజీవి మంచి డ్యాన్సర్..మెగాస్టార్ అయ్యాడని సదరు డ్యాన్స్ డైరక్టర్ అభిప్రాయం..నిజమే కదా


Comments