కోర్టులో కేసు తీసుకున్నారు..ఇక్కడ చెక్ చేసారు..చంద్రబాబు మార్క్ బ్యాలెన్స్ పాలిటిక్స్

అంతే..అంతే..చంద్రబాబుగారి రాజకీయ వ్యూహాలను అంత తొందరగా పసిగట్టడం సాధ్యం కాదు..ఐతే ఈ మధ్య మాత్రం బాగా బుక్కవుతున్నారంటున్నారు..ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో చెకింగ్ విషయాన్ని కూడా లీక్ చేసి తనపై సింపతీ కోసం బాగానే ట్రై చేసారు..తనకి మాత్రమే అనుకూలమైన మీడియాకి ఇది లీక్ చేస్తే..ఆ తర్వాత మిగిలిన ఛానళ్లు వెంటపడతాయనుకున్నారు..కానీ ఇది వాట్సాప్ యుగం కావడంతో..అది కాస్తా..ఇతర ఛానళ్లకి అందులోనూ ఈమధ్యనే తెలంగాణలో చేతులుమారిన ఛానళ్లకి దొరకడంతో అది వాళ్లు అనుకున్న రీతిలో కాకుండా ఇంకో మార్గంలో జనంలోకి వెళ్లిపోయింది..

కానీ అసలు శుక్రవారం చంద్రబాబునాయుడుగారు ముఖ్యమంత్రిగా ఉండగా..ప్రభుత్వనిధులను పార్టీ కోసం ప్రచారం కోసం ఖర్చు చేశారంటూ ఓ కేసు పెట్టాలంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది..అది సాక్షి..సహా కొన్ని ఛానళ్లలో మాత్రమే వచ్చింది..మన ఛానళ్లు మాత్రం తొక్కిపెట్టాయ్..అది కాస్తా నానా రచ్చ అవుతుందని..దాన్ని బ్యాలెన్స్ చేసేందుకే ఇలా చెకింగ్ పై యాగీ చేయించాలని ప్లాన్ చేశారంటారు.

ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో సెక్యూరిటీ వేరు..ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సెక్యూరిటీ వేరు.ఐతే పూర్తిగా తొలగించడం మాత్రం తప్పు..కానీ సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వాలు మారినప్పుడు మాకు తెలిసినంతవరకూ తిరిగి కొత్తగా సెక్యూరిటీ కేటాయిస్తారు..పాత పద్దతిలోనే ఎలాంటి తనిఖీలు లేకుండా టిడిపి చెప్తున్న రీతిలోనే భద్రత ..ఇతర హంగామా కావాలంటే తిరిగి ధరఖాస్తు చేసుకోవడం వగైరా వ్యవహారాలు ఉంటాయని ప్రొటోకాల్ తెలిసినవాళ్లు చెప్తున్నారు..పైగా చెక్ చేస్తున్నప్పుడు బాబు ముందు నుంచి తీసిన ఫోటోలు చూస్తుంటే..రెగ్యులర్ గా ప్రతి వ్యక్తిని చేసే చెకింగ్ ని కూడా కావాలని హడావుడి చేయడానికి తీసుకున్నట్లుంది తప్పితే మరోటి కాదని అంటున్నారు.. లేదంటే బాబుగారి వెంటే ఎప్పుడూ ఓ మీడియా  ఉంటుందనైనా ఒప్పుకోవాలి..అలాంటి ఫోటో తీసినవెంటనే ఛానళ్లకి వచ్చేసిందంటే..మీడియాతో బాబుగారి సంబంధాలు ఎలా ఉంటాయో తెలీడం లేదా..

Comments